S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

02/04/2017 - 23:10

నలుగురు స్నేహితులు దూర ప్రయాణం చేస్తూ ఒక అడవిలోకి ప్రవేశించారు. చీకటి పడింది. ఒక చెట్టు కింద పడుకున్నారు. క్రూరమృగాలు రాకుండా వంతుల ప్రకారం మేలుకున్నారు.
వాళ్లు నలుగురూ నాలుగు విద్యలు తెలిసిన వాళ్లు. బ్రాహ్మణుడు, వడ్రంగి, బట్టలు కుట్టే వ్యక్తి, స్వర్ణకారుడు.

02/04/2017 - 23:07

ఓ పండుగ రోజున గుడికి వెళ్లాను. దైవ దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని గుడి అరుగు మీద కూర్చున్నాను. గుడికి నాతో వచ్చిన ముసలాయనకి ఒక కాలు అవిటి, పాపం కుంటుతూనే నడిచాడు. ఆయన నెమ్మదిగా వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. మొదటి నుండి గమనిస్తున్న అతనిని ఒక ప్రశ్న అడగాలనిపించింది. ధైర్యం చేసి మిమ్మల్ని ఒకటి అడగనా అన్నాను. దానికేం అడుగు అన్నాడు.

01/29/2017 - 03:46

సృష్టిలో ప్రతిదీ ప్రత్యేకత సంతరించుకున్నదే. కొన్నిటికి గుర్తింపు ఉంటుంది. కొన్నిటికి ఉండదు. ప్రపంచంలో ప్రతి మనిషీ ప్రత్యేకత వున్నవాడే. ప్రత్యేకత ఉన్నది ప్రదర్శన కోసం కాదు.

01/29/2017 - 03:20

విశ్వామిత్రుడు మహోదయుని, వశిష్ఠ కుమారులని శపించాక ఋషులని త్రిశంకుడికి పరిచయం చేసి చెప్పాడు.
‘ఇక్ష్వాకు వంశీయుడైన ఇతను శరీరంతో స్వర్గానికి వెళ్లడానికి చేసే యజ్ఞానికి మీరంతా సహాయం చేయండి’

01/29/2017 - 03:18

రామం, సూర్యం స్నేహితులు. ఇద్దరిదీ ఒకే వీధి. ఆ ఊరి ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ కలిసి పాఠశాలకు వెళ్తారు. పాఠశాల నుంచి కలిసి ఇళ్లకు చేరుతారు.
రామంకి వాళ్ల మావయ్య ఒక చక్కని పెన్నును బహుమతిగా ఇచ్చాడు. నాలుగు రంగుల రీఫిళ్లు అందులో ఉన్నాయి. ఇష్టం వచ్చిన రంగు రీఫిల్‌తో రాసుకోవచ్చు.

01/28/2017 - 21:20

డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులను చూసి చాలా మంది అలెగ్జాండర్‌ని ఉదహరిస్తూ ఉంటారు. ఆయన శవపేటికలో బయటకు ఆయన చేతులు కన్పిస్తూ ఉంటాయని, తాను ఏమీ తీసుకొని వెళ్లడం లేదనడానికి ఉదాహరణగా ఆ కథని చాలామంది చెబుతూ ఉంటారు. అది పూర్తిగా వాస్తవం కాదు.
మనిషి జీవితంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. డబ్బు సంపాదన ఎంత ముఖ్యమో దాని కోసమే జీవితాన్ని అంకితం చేయకపోవడం అంతకన్నా ముఖ్యం.

01/22/2017 - 01:22

వర్షం లేకుండా సృష్టి లేదు. కానీ ఎప్పుడూ వర్షం ఉంటే జీవితం పరమ బోర్‌గా అన్పిస్తుంది.
చెట్లూ, చేమలు వర్షం లేకుండా మనజాలవు. అదే విధంగా మనుషులు బ్రతకలేరు.
వర్షం లాంటివే- బాధలు, కష్టాలు, వేదనలు. అవి అన్నీ జీవితంలోని ముఖ్యమైన విషయాలు. ఇవి లేకుండా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి లేడు.

01/22/2017 - 01:00

భగత్‌సింగ్
రచన : ఎం.వి.ఆర్.శాస్ర్తి
పుటలు: 280 - వెల: రు.200
దుర్గా పబ్లికేషన్స్
జి-1, సాయకృష్ణ మాన్షన్,
1-1-230/9, వివేక్‌నగర్, చిక్కడపల్లి,
హైదరాబాద్ - 500 020
ఫోన్ : 040-27632824
9441257962
www.supatha.in
**

01/22/2017 - 00:47

ఒక వివేకవంతుడు ఏదో పని మీద బయల్దేరాడు. మార్గమధ్యంలో ఒక ఎడారిని దాటాల్సి వచ్చింది. కొన్ని గంటలు ప్రయాణిస్తే అతను ఎడారిని దాటవచ్చు. మార్గమధ్యలో అవసరమయి సరంజామాని కూడా ముందు జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఎడారి మార్గంలో వెళుతున్నాడు.
ఆ ఎడారిలో అతనికి ఒక సన్యాసి ఎదురుపడ్డాడు. అతను ఆ సన్యాసిని చూసి ఆశ్చర్యపోయాడు. అంత నిర్జన ప్రదేశంలో ఒక గుడారం వేసుకుని ఆ సన్యాసి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

01/21/2017 - 23:05

వశిష్ఠుడి చేతిలో పరాభవం చెందిన విశ్వామిత్రుడు తన పెద్ద భార్యతో ఉత్తర దిక్కుకి వెళ్లి కేవలం పళ్లు, కందమూలాలే ఆహారంగా తీసుకుంటూ ఇంద్రియ నిగ్రహంతో తీవ్రమైన తపస్సు చేశాడు. తర్వాత ఆయనకి నలుగురు కొడుకులు పుట్టారు. అలా కొంతకాలం ఆయన తపస్సు చేశాక శివుడు ప్రత్యక్షమై చెప్పాడు.
‘విశ్వామిత్రా! నువ్వు రాజర్షివి అయ్యావు’

Pages