AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్నాడు తెల్లవారుఝామున జనకుడి చేత చేయించాల్సిన యజ్ఞ విధులని మహర్షులు చేయించాక ఆయన గౌతముడి కొడుకు, తన పురోహితుడైన శతానందుడితో ఇలా చెప్పాడు.
‘సరయూ నదీ తీరంలో, చుట్టూ నీటి ఉసిరి చెట్లు గల పుష్పక విమానం లాంటి, పరిశుద్ధమైన సాంకాశ్వ నగరంలో ధార్మికుడైన నా తమ్ముడు ఉన్నాడు యజ్ఞ సంభారాలని సమకూర్చడంలో అతను నాకు సహాయం చేశాడు. ఈ పెళ్లికి అతను వస్తే నాకు ఆనందం’
వెంటనే శతానందుడు కొందరు దూతలని పిలిచాడు. వారు జనకుడి ఆజ్ఞ ప్రకారం కుశధ్వజుడ్ని తీసుకురావడానికి గుర్రాల మీద బయలుదేరి సాంకాశ్వానికి వెళ్లి తాము ఎందుకు వచ్చారో చెప్పారు. వెంటనే
కుశధ్వజుడు మిథిలా నగరానికి చేరుకున్నాడు. ఆయన శతానందుడికి, జనకుడికి గౌరవంగా నమస్కరించాడు.
జనకుడు తన మంత్రి సుదామతో చెప్పాడు.
‘నువ్వు వెళ్లి దశరథుడి కొడుకులు, మంత్రులతో సహా దశరథుడ్ని వెంట పెట్టి తీసుకురా’
ఆ ప్రకారం దశరథుడు వచ్చాక ఆయన జనకుడితో చెప్పాడు.
‘మహారాజా! మా వంశానికి దైవం, పూజ్యుడు ఐన వశిష్ఠుడు మా తరఫున మా పూర్వీకుల గురించి మీకు చెప్తాడు’
వశిష్ఠుడు వెంటనే ఇలా చెప్పాడు.
‘ఇక్ష్వాకు వంశంలోని ముప్పై ఆరవ మహారాజు దశరథుడు. అవ్యక్తం నించి పుట్టినవాడు, సదా ఉండేవాడు, నిత్యుడు, నాశనం లేని వాడైన బ్రహ్మదేవుడికి మరీచి, మరీచికి కాశ్యపుడు కొడుకులుగా పుట్టారు. కాశ్యపుడికి సూర్యుడు, సూర్యుడికి మనువు, ప్రజాపతి ఐన మనువుకి ఇక్ష్వాకువు పుట్టారు. ఆ ఇక్ష్వాకుడు అయోధ్యకి మొదటి రాజు. ఆయన కొడుకు కుక్షి. కుక్షికి వికుక్షి, అతనికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అతనికి పృథువు, పృథువుకి త్రిశంకుడు పుట్టారు. త్రిశంకుడికి దుందుమారుడు, అతనికి యవనాశ్వుడు, అతనికి మాంథాత, మాంథాతకి సుసంధి, అతనికి ధృవసంధి, ప్రసేనజిత్ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. ధృవసంధికి భరతుడు, అతనికి అసితుడు పుట్టారు. అసితుడికి హైహయ, తాలజంఘ, శశిబిందు వంశరాజులు శత్రువులు అయ్యారు. వారితో చేసిన యుద్ధంలో ఓడిపోయి, అసితుడు కొద్దిసైన్యంతో, మంత్రులతో హిమాలయాల్లోని భృగుప్రస్రవణం అనే చోటకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అతని ఇద్దరు భార్యలు గర్భవతులు. కాళింది అనే భార్య తన సవతికి గర్భవిచ్చేదానికి విషాన్ని ఇచ్చింది.
‘అదే సమయంలో అక్కడ భృగువంశానికి చెందిన చ్యవనుడు ఉండేవాడు. విషం పెట్టబడ్డ భార్య కొడుకుని కోరుకుంటున్నానని చ్యవనుడితో చెప్పింది. సవతికి విషం పెట్టిన కాళింది కూడా ఆ సమయంలో అక్కడికి వెళ్లింది. చ్యవనుడు విషం పెట్టబడ్డ సవతితో చెప్పాడు.
‘గొప్ప బలం, పరాక్రమం గల కొడుకు నీ గర్భంలో ఉన్నాడు. కొద్దికాలంలో అతను నీకు విషంతో పుడతాడు’
అసితుడు మరణించాక దుఃఖంలో ఉన్న ఆమెకి చ్యవనుడి అనుగ్రహంతో కొడుకు పుట్టాడు. సగరుడి కొడుకు అసమంజుడు. అతనికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు పుట్టారు. భగీరథుడి కొడుకు కకుత్సుడు. అతనికి రఘువు పుట్టాడు. రఘువుకి ప్రవృద్ధుడు పుట్టాడు. ప్రవృద్ధుడు వశిష్ఠుడి శాపంతో నరమాంస భక్షకుడు అయ్యాడు. వశిష్ఠుడిని బదులుగా శపించడానికి నీటిని తీసుకున్న ప్రవృద్ధుడు భార్య వారించడంతో ఆ నీటిని తన పాదాల మీద విడిచి కల్మష పాదుడు అయ్యాడు. అతని కొడుకు శంఖణుడు. అతనికి సుదర్శనుడు, అతనికి అగ్నివర్ణుడు, అతనికి శ్రీఘ్రగుడు, అతనికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, అతనికి అంబరీషుడు కొడుకులుగా పుట్టారు. అంబరీషుడికి సహుషుడు, నహుషుడికి యయాతి, అతనికి నాభాగుడు జన్మించారు. అజుడికి పుట్టినవాడే దశరథ మహారాజు. ఆయన ఇద్దరి కొడుకులు రామలక్ష్మణులు. జనక మహారాజా! మొదటి నించీ ఇక్ష్వాకులది పరిశుద్ధమైన వంశం. వారంతా ధార్మికులు, వీరులు, సత్యం మాట్లాడేవారు. అలాంటి వంశంలో పుట్టిన రామలక్ష్మణులకి నీ కూతుళ్లని ఇచ్చి పెళ్లి చేయి’
(బాలకాండ సర్గ 70-75)
ఆ కథ విన్న అమ్మమ్మ మీనమ్మ ఆశే్లషతో చెప్పింది.
‘హరిదాసు ఏడు తప్పులని చెప్పాడు. అవేమిటో కనుక్కో చూద్దాం’
**

మీకో ప్రశ్న

ఇక్ష్వాకు వంశానికి రఘువంశం
అనే మరో పేరు ఎలా వచ్చింది?
**
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

పరశురామ క్షేత్రం ఏది?
పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలని వెనక్కి పంపి తన కోసం సృష్టించుకున్న నేలని పరశురామ క్షేత్రం అంటారు. అది కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర సముద్ర తీరం.
కిందటి వారం రామాయణ కథలో తప్పులు
1.వారం రోజులు కాదు. జనక మహారాజు దూతలు మూడు రోజులు ప్రయాణం చేసి, అయోధ్యా నగరానికి చేరారు.
2.వృద్ధుడైన దశరథుడికి స్వాగతం పలికింది శతానందుడు కాదు. జనకుడు.
3.వారం రోజులు కాదు. నాలుగు రోజులు ప్రయాణం చేశాక దశరథుడు విదేహ దేశాన్ని చేరాడు.
4.జనకుడు దశరథుడికి, ఆయన పరివారానికి దారిలో ఆతిథ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇది కూడా హరిదాసు చెప్పలేదు.
5.మర్నాడే పెళ్లి అని నిర్ణయించారు. ఇది హరిదాసు చెప్పలేదు.
6.కూతుళ్ల పెళ్లిళ్లకి సంబంధించిన అంకురార్పణని కూడా జనకుడు ఆ రాత్రి చేశాడన్న సంగతి హరిదాసు చెప్పలేదు.
7.బాలకాండ సర్గ 67,68 అని హరిదాసు చెప్పాడు కాని 69వ సర్గ కూడా ఇందులో ఉంది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి