S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దగ్గర - దూరాలు

నా చిన్నప్పుడు మా వూర్లో ఒకే ఒక టెలిఫోన్ వుండేది. అది పోస్ట్ఫాస్‌లో. పోస్ట్ఫాసు మా బాపు దవాఖానాకి ఎదురుగా వుండేది. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి టెలిఫోన్ని చూసేవాన్ని. నాకు చాలా ఆశ్చర్యంగా అన్పించేది. మా బాపు కూడా ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో వున్న మా అక్కతో మాట్లాడేవాడు. నాకూ మాట్లాడాలని అనిపించేది. కానీ ఆ అవకాశం చిక్కేది కాదు. ఎందుకంటే అప్పుడు టెలిఫోన్‌లో మాట్లాడటం చాలా ఖరీదుగా వుండేది. ట్రంక్‌కాల్ బుక్ చేసి కనెక్షన్ కోసం చాలాసేపు వేచివుండాల్సి వచ్చేది.
కొంతకాలం తర్వాత మా ఇంట్లోకి కూడా ఫోన్ వచ్చింది. ఎక్కడో వున్నవాళ్లతో వెంటనే ఎస్‌టిడిలో మాట్లాడే సౌకర్యం వచ్చేసింది. అది ఇంకా ఆశ్చర్యంగా అన్పించేది. ఇదంతా గతకాలపు ముచ్చట. ఆ తరువాత పేజర్లు, మొబైల్ ఫోన్లు వచ్చాయి. ఇంట్లో ఎక్కడున్నా మొబైల్ ఫోన్లతో మాట్లాడే సౌకర్యం వచ్చేసింది. ఆ తరువాత కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు ఇట్లా ఎన్నని చెప్పేది. ఎన్నో వచ్చేశాయి. మా పిల్లల ఫోన్లలో ఎన్నో కొన్ని వందల యాప్స్. ఓ డజను సాంఘిక మాధ్యమాలు. వాళ్లు తమ సమాచారాన్ని ఎక్కడో మేఘాల్లో (క్లౌడ్స్)లో దాచుకుంటూ వుంటారు.
ఇప్పుడు ఎవరికన్నా ఏదన్నా సమాచారాన్ని, ఫొటోని పంపాలంటే ఒక్క అర నిమిషం చాలు. మాట్లాడాలంటే కూడా అంతే. చూస్తూ మాట్లాడుకునే పరిస్థితి కూడా వచ్చేసింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు చాలామందితో కనెక్టు అవుతున్నాం.
నిజంగానే చాలామందితో ఇప్పుడు కనెక్టు అవుతున్నామా?
చాలామందితో కనెక్టు అవుతున్నాం కానీ నిజానికి చాలామందితో దూరంగా వుంటున్నాం. ఎన్నోసార్లు చూస్తూ చదువుకునే ఉత్తరాలు అదృశ్యమైనాయి. చేతిరాత అదృశ్యమై పోయింది. ఇంక్ పెన్నుల జాడ లేకుండా పోయింది. ఎదురెదురుగా కూర్చొని మాట్లాడే పరిస్థితి పూర్తిగా తగ్గిపోయింది. ఎవరితోనైనా మాట్లాడదామని కూర్చుంటే కూడా వాళ్ల ఫోన్లు అనుక్షణం మ్రోగి వాళ్లతో మనల్ని మాట్లాడనివ్వని పరిస్థితి ఏర్పడింది. మాట్లాడటం కన్నా అక్షరాల ద్వారా సమాచారం పంపించుకోవడం ఎక్కువైపోయింది. ఎందరితోనో కనెక్టు అయివున్న ఇప్పటి తరం నాకు ఏకాకిలా అనిపిస్తుంది.
ఇది ఇలా కొనసాగాల్సిందేనా?
సాంకేతికత మన జీవితాలని మింగేయాల్సిందేనా?
కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదా?
దగ్గర కూర్చొని ఆనందించే పరిస్థితి రాదా?
ఈ ఫోన్లు మానేసి హృదయాలతో మాట్లాడుకోలేమా?
దగ్గర అయినట్టుగా అన్పిస్తుంది.
కానీ -
మనుషుల మధ్య దూరాలు అనంతంగా పెరిగిపోతున్నాయి.
ఈ పరిస్థితి మార్చలేమా?

- జింబో 94404 83001