S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

09/03/2017 - 00:08

‘బహుజన హితాయ, బహుజన సుఖాయ..’ ఆకాశవాణి లోగోలో కనిపించే మాటలు. గత శతాబ్దపు ఐదో దశలో తెలుగుదేశానికి మరపురాని దశకు కారణం అప్పటి ఆకాశవాణి సంగీత వైభవమే. అందులో ముఖ్యంగా భక్తిరంజని.

08/26/2017 - 22:26

ఆగస్టు 27 వోలేటి వేంకటేశ్వర్లు జయంతి
**

08/19/2017 - 23:48

మనసనేదే లేకపోతే మనిషి ఒక్క క్షణం ఉండలేడు. మనస్సును ‘కోతి’ అనీ, హంస అనీ, ఊయల అనీ, ఆకాశమనీ, పుష్పమనీ.. ఇలా ఎనె్నన్నో ఉపమానాలతో కవులు వర్ణిస్తారు.
మన ఋషులు ఈ మనస్సును జగత్తుకు ప్రతిరూపంగా చెప్పారు.
మనం ఆలోచించేదాన్ని బట్టే ఏదైనా.. జరిగే పనులన్నీ మన మనస్సును బట్టే.

08/12/2017 - 22:20

తిరువయ్యార్‌లోని ప్రణతార్తిహరుని దేవాలయం మాడవీధిలో పాతికేళ్ల కుర్రవాడు ఎవరి కోసమో వెదుకుతూ ఒకచోట ఆగాడు - చక్కని ముఖ వర్ఛస్సుతో కళకళలాడుతూ ఇంటి బయట అరుగు మీద పద్మాసనం వేసుకున్న ఓ వ్యక్తి కనిపించాడు. నమస్కరించి నిలబడ్డాడు.

08/06/2017 - 23:57

‘ముఖే ముఖే సరస్వతి’ అంటారు. సంగీతం విషయంలో ఇది చాలా యధార్థం. భగవద్దత్తంగా కొందరికి శృతిజ్ఞానం అలవడుతుంది. మరి కొందరికి లయ జ్ఞానం అద్భుతంగా ఉంటుంది. ఈ రెంటితోబాటు అప్రతిహతమైన మనోధర్మం మరి కొందరికి అలవోకగా సిద్ధిస్తుంది.
ఎటువంటి సాధనా లేకపోయినా రాణించిన అటువంటి మహానుభావులున్నారు. వారే కారణజన్ములైన నాదోపాసకులు... చాలా అరుదుగా జన్మిస్తారు. ‘నాదతనుమనిశం’ అంటారు త్యాగయ్య.

07/30/2017 - 01:00

వాల్మీకి రామాయణం ఎవరో ఓ మహారాజు చరిత్రలా వుండి వుంటే ఈపాటికి జనం ఆ కథను మరిచిపోయి ఉండేవారు. కానీ రామాయణం ఒక ఆధ్యాత్మిక జ్ఞాననిధి. కాబట్టే పరమ శాశ్వతమైన మహా కావ్యమయింది.
ముఖ్యంగా త్యాగయ్య తరించడానికి కారణం రామకథే. సంగీత మూర్తిత్రయంలో త్యాగరాజు అనుసరించిన మార్గమే చాలా భిన్నం.

07/30/2017 - 01:00

సంకల్పాలు అనేక విధాలు. మన పూర్వీకులంద జేసిన సాంస్కృతిక సంపదను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే తపన ఏ కొద్దిమందికో గాని ఉండదు.
అసలు సమాజ హితం కోరే వారెందరు? తాను మాత్రమే సుఖంగా ఉండాలి, తన కుటుంబం హాయిగా ఉండాలనలుకునేవారే ఎక్కువ. వారి స్వార్థం ముందు అన్నీ దిగదుడుపే.

07/16/2017 - 04:32

ఘన ఘనా ఘనము చీకటి మేడ వెలిగించు
మెఱుపు దివ్వెల నూనె తరుగలేదు
పవలు రాతిరి తీరుబడి లేక ఘోషించు
తోయధీశుని గొంతు రాయలేదు.
ఇన బాలకుని దినమ్మును గర్భమున బూను
పొడుపు దిక్సతి కాన్పులుడుగలేదు
ఋతురాజు ధారుణీ సతికి సొమ్ములు పెట్టి
కులికించు పని మానుకొనగలేదు
విశ్వ నిర్మాత చల్లని వీక్షణమున
నేటికిని కెంపు ఛాయ కాన్పించలేదు

07/10/2017 - 00:34

A Thing of Beauty is Joy forever - అన్నాడో ఆంగ్ల కవి.
చూసే దృష్టిని బట్టే సృష్టి. భౌతికంగా కంటికి కనిపించే అందం వేరు.

07/08/2017 - 00:03

క్రిక్కిరిసిన సభా ప్రాంగణం. ఎదురుగా మహా విద్వాంసులందరూ కొలువై యున్నారు. సంప్రదాయ వేషధారణతో యిద్దరు విదుషీమణులు అభివాదం చేస్తూ వేదిక నలంకరించారు.

Pages