S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

02/25/2017 - 22:04

పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే హరియట హరుడట సురులట నరులట అఖిలాండ కోటులట ఇందరిలో
పరమాత్ముడు వెలిగే
గగనానిల తేజో జల భూమయమగు
ఖగమృగ నగ తరు కోటులలో
సగుణములో విగుణములో సతతము
సాధు త్యాగ రాజాది ఆశ్రీతులలో పరమాత్ముడు వెలిగే

02/19/2017 - 01:47

రేడియో కోసమే పుట్టి రేడియోకే తమ జీవితాలను అర్పణ చేసిన వారిలో చరితార్థులైన వారెందరో ఉన్నారు. నిజానికి వారెప్పుడో చేసి ఉంచిన కళాఖండాలే ఈ వేళ రేడియో ప్రతిష్టను నిలబెట్టి ఉంచుతున్నాయనటంలో సందేహం లేదు. కొన్ని ప్రమాణాలను
నిర్దేశించి, చక్కని దిశను దశనూ ఏర్పరచి వెళ్లారు. ఆ
మహామహుల అనన్య కృషి వల్ల రేడియోకు ఒక స్థిరత్వం ఏర్పడింది.

02/12/2017 - 04:13

వెనిస్ ఆఫ్ ది నార్త్ అని ముద్దు పేరున్న గీతూర్న్‌లో మనకి ఎక్కడికక్కడ అందమైన కెనాల్స్ కనిపిస్తాయి. 1230లో ఈ ప్రాంతాన్ని గుర్తించారు. ఇది సహజసిద్ధమైన అందాలతో అలరారుతూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని కనిపెట్టిన సమయంలోనే మేకల అరుపులు వినిపించాయట. అందుకే దీనికి గీతూర్న్ అని పేరు పెట్టారు. అంటే మేక అరుపు అని అర్ధం. ఇక్కడ మనకు కార్లు కనిపించవు.

02/12/2017 - 04:12

ఒకప్పుడు కార్ల వాడకం లగ్జరీ. కానీ నేడది అనివార్యం. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొన్ని దశాబ్దాల క్రితం నాటికి నేటికీ వాహనాల పెరుగుదలతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని ఒక వైపు పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నా కార్ల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.. కాస్త ఆర్థికంగా పట్టు చిక్కిన ప్రతి కుటుంబం నేడు కారు వాడకం వైపే మొగ్గు చూపుతోంది. కారు వాడకం అంటే అదో స్టేటస్ సింబల్ మరి.

02/11/2017 - 23:44

శాస్ర్తియ సంగీతమంటే మనకేదో అర్థంకాని బ్రహ్మ పదార్థమని కొందరి అభిప్రాయం. సంగీతాన్ని విచ్చలవిడిగా వదలకుండా, ఆ కళకు పెద్దలు కొన్ని నియమాలు ఏర్పరిచి పెట్టారు. ఈ నియమాలు పాటిస్తూ పాడితే అది శాస్ర్తియ సంగీతం. అలాగే లలిత సంగీతంలోనూ కొన్ని నియమాలున్నాయి. వాటిని పాటించాలి. ఇందులో శాస్ర్తియ సంగీతం కంటే కొంత స్వేచ్ఛ ఉంటుంది.

02/04/2017 - 23:31

స రళమై, సుందరమై, మృదుమధురమైన మన తెలుగు పద్యం ఎవరూ వీలునామా వ్రాసి ఇవ్వవలసిన అవసరం లేని ఆంధ్రుల ఆస్తి. పద్య సాహిత్యం మన తెలుగు భాషకే ఔన్నత్యాన్ని తెచ్చిన అద్భుతమైన ప్రక్రియ.
నన్నయాదిగా ఎందరో కవిశేఖరులు పద్య శిల్పాన్ని రమణీయార్థమైన సొగసులతో, శే్లష యమకాద్యలంకారాలతో సుసంపన్నం చేసి పెట్టి లోకానికి అందించారు.

01/28/2017 - 23:36

భూగోళం జీవ వైవిధ్యానికి నిలయం. ఎక్కడ చూసినా అనేక రకాల పక్షులు, జంతువులు, క్రిమి కీటకాలు, ఉభయచర జీవులు ఎన్నో కనిపిస్తాయ. వీటితో పాటు పాములు కూడా కనిపిస్తాయి. భయంకరమైన విష సర్పాలతో పాటు, విషం లేని పాములు కూడా కనిపిస్తాయి. అయితే ఐర్లాండ్ దేశంలో మాత్రం మనకి ఒక్క పాము కూడా కనిపించదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

01/28/2017 - 22:35

సంగీతం పేరు చెబితే సప్తస్వరాలు మనసులో మెదులుతాయి. ఎవరు మాట్లాడినా, సాహిత్యం ఆలోచనామృతం, సంగీతమాపాత మధురం లాంటి మాటలు వింటూనే ఉంటాం.

01/28/2017 - 21:47

‘చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేది సాహిత్యమే’ - ఈ మాటలన్నది తలపండిన సాహితీవేత్తా కాదు, ప్రఖ్యాత రచయిత అంతకన్నా కాదు. నాలుగంటే నాలుగేళ్ల వయసున్న ఓ చిన్నారి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా - ఈ విషయం తెలిసిన ప్రపంచ పాఠక లోకం ఔరా అంటోంది. ఆడుతూ పాడుతూ అల్లరి చేసే వయసులో, పుస్తకాలన్నా, స్కూలుకెళ్లాలన్నా మారాం చేసే పిల్లలు అన్నిచోట్లా కనిపిస్తారు.

01/22/2017 - 00:55

మాటకు ఎంత శక్తి ఉందో, శబ్దానికీ అంత శక్తీ ఉంటుంది. లేకపోతే నోరు లేని వాద్యాలకు చోటెక్కడ? సాహిత్యాన్ని అర్థం చేసుకుంటాం. సంగీతం ఆనందిస్తాం. సాహిత్యానికి అర్థం చెప్పగలిగినంత తేలికగా సంగీతాన్ని వివరించి చెప్పటం కష్టం. ఎవరి కంఠాల్లో స్వరాలు ఎటువంటి విన్యాసాలతో ఆనందాన్నిస్తాయో, ఎవరూ చెప్పలేరు.

Pages