అమృత వర్షిణి

బ్రేవో ఫ్రీదా! --- స్లమ్‌డాగ్ మిలియనీర్ హీరోయిన్ సమాజ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్కార్ అవార్డుల పంట పండించిన స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా చూడని వాళ్లు, అందులో హీరోహీరోయిన్లు దేవ్ పటేల్, ఫ్రీదా పింటోల గురించి తెలియనివాళ్లు అరుదనే చెప్పాలి. ఇండియాలోని మురికివాడల బతుకుచిత్రాన్ని కళ్లకు కట్టిన ఈ సినిమా అంతర్జాతీయంగా వేనోళ్ల ప్రశంసలు పొందింది. స్లమ్‌డాగ్‌లో నటించిన దేవ్, ఫ్రీదా ఆ తర్వాత హాలీవుడ్‌లో భవిష్యత్తు వెతుక్కుని బిజీ అయిపోయారు.
ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా మరోసారి ఫ్రీదా పేరు మార్మోగిపోయింది. ఆమెకు అవార్డు రాకపోయినా ఆమె పేరు మళ్లీ వార్తల్లోకి రావడానికి కారణం- మానవతా హృదయంతో ఆమె చేసిన ఓ మంచి పనే కారణం. ఇంతకీ ఫ్రీదా ఏం చేసిందనేగా మీ ప్రశ్న? దేశదేశాలనుంచీ స్టార్లు హాజరయ్యే ఈ సినిమా పండుగ సందర్భంగా రోజూ రాత్రి పూట భారీస్థాయిలో డిన్నర్ ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఇలాంటి ఆస్కార్ డిన్నర్‌లో ప్రఖ్యాత చెఫ్ ఉల్ఫ్‌గాంగ్ ప్యూక్ ఆధ్వర్యంలో భారీయెత్తున వడ్డనలు జరిగాయి. అయితే ఎంతమంది డిన్నర్ చేశారో అంతకు రెట్టింపు ఆహారం మిగిలిపోయిందట. ఈ విషయం తెలుసుకున్న ఫ్రీదా వెంటనే లాస్ ఏంజెలిస్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించి, ఆ ఆహారం వృథా కాకుండా అన్నార్తులకు తరలించిందట. ఫ్రీదా చొరవతో ఆ రోజు 800మంది నిరుపేదలు కడుపు నింపుకున్నారట. ఈ విషయాన్ని ఫ్రీదా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘వృథా చేయడం గ్లామర్ కాదు... అన్నార్తులకు ఆహారం అందించడంలోనే గ్లామర్ దాగి ఉంది’ అంటూ చేసిన కోట్, ఎంతోమందిని కదిలించింది.
వాస్తవానికి ఫ్రీదా ఎంతోకాలంగా సమాజ సేవ చేస్తోంది. కాలిఫోర్నియాలోని కోపియా అనే లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థతో కలిసి పార్టీల్లోనూ, రెస్టారెంట్లలోనూ వృథా అవుతున్న ఆహారాన్ని పేదలకు చేరవేస్తోంది.
*