అమృత వర్షిణి

అతనొక్కడు... 39మంది భార్యలు! (జంబో ఫ్యామిలీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఊళ్లు కళకళలాడేవి. చిన్నాపెద్దా అంతా కలిసి మెలసి ఉండేవారు. ఇల్లంతా ఎప్పుడూ సందడిగా, పండగలా ఉండేది. కానీ నేడు జాయింట్ ఫ్యామిలీల నుండి న్యూక్లియర్ ఫ్యామిలీలు పుట్టుకొచ్చాయి. మేమిద్దరం... మాకు ఒక్కరే అంటూ పేరెంట్స్ గిరి గీసుకుని బతికేస్తున్నారు. ఇరుగు పొరుగుతోను, బంధుమిత్రులతోను సంబంధాలే ఉండడంలేదు. ఎవరింటికీ వెళ్లరు... ఇంటికి ఎవరొచ్చినా ఆదరించరు. ప్రేమ, ఆప్యాయతలకు ఎక్కడా తావు లేని బతుకులు బతుకుతున్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఈ ధోరణికి భిన్నంగా బతుకుతున్నాడు. అతని కుటుంబ సభ్యుల సంఖ్య వింటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. 183 మంది కుటుంబ సభ్యులు కలిగి ఉన్న ఆ వ్యక్తి పేరు జియోనా చనా. మిజోరాంలోని బంగ్లాదేశ్-బర్మా సరిహద్దులో గల బక్త్‌వాంగ్ గ్రామంలో నివసించే జియోనా చనాది ఇంత పెద్ద కుటుంబం కావడానికి కారణం అతను ఏకంగా 39 మంది మహిళలను వివాహం చేసుకోవడమే. అవును ఇది నిజం. అతనికి 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 33 మంది మనవలు, మనవరాండ్రు ఉన్నారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులతో కలపి మొత్తం 183 మందితో జియోనా చనా ఇల్లు నిత్యం తీర్థంలా కళకళలాడిపోతుంటుంది. ఇంత మంది జనాభా ఉన్నా జియోనా ఇంట్లో ఏమాత్రం గందరగోళం ఉండదు. ఎవరి పని వారు చేసుకుపోవడం వల్ల అంతటా ప్రశాంతతమే నిండి ఉంటుంది. వ్యవసాయం చేసేవారు వ్యవసాయం, ఉద్యోగాలు చేసే వారు ఉద్యోగాలు, వ్యాపారం చేసే ఆ వృత్తిలోను బిజీగా ఉంటారు. వీరంతా ఒకే ఇంట్లో ఉంటారు. నాలుగంతస్తుల ఆ భవంతిలో ఎవరి బెడ్‌రూములు వాళ్లవే. ఈ విధంగా ఘనత సాధించిన జియోనా తాను తనకి పదిహేడేళ్ల వయసు ఉన్నప్పుడు తొలి వివాహం చేసుకున్నానని చెబుతాడు. ఇప్పుడు కూడా తాను మరో వివాహం చేసుకునే శక్తి కలిగి ఉన్నానని అంటాడు. అతని నాలుగంతస్తుల బిల్డింగ్‌లో మొత్తం వంద బెడ్‌రూములు ఉంటాయి. కొడుకులు, కోడళ్లు, మనవలు ఎవరి వాటాలో వారు ఉంటారు. అయితే అంతా కామన్‌గా ఒకే వంటగదిని వాడుతారు. జియోనా భార్యలు, కోడళ్లు, పిల్లలు వంటలో ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఉంటారు. జియోనా ఇంట్లో రోజుకి 90 కిలోల బియ్యం, 60 కిలోల బంగాళాదుంపలు వండుతారు. మాంసాహారం తినే రోజుల్లో అయితే ఏకంగా 30 కోళ్లను వండాల్సి ఉంటుంది. జియోనా బెడ్‌రూముకి దగ్గరలో 36 ఏళ్ల వయసు గల అతి చిన్న వయస్కురాలైన భార్య రుక్మిణి నిద్రిస్తుంది. అతనికి కావలసిన సేవలు చురుగ్గా చేయడానికే ఈ ఏర్పాటు. మిగతా వారంతా అతని గదికి కాస్త దూరంలో ఉండే గదుల్లో నిద్రపోతారు. కుటుంబంలో అత్యంత ప్రధానమైన వ్యక్తి జియోనా అంటుంది అతని చిన్న భార్య రుక్మిణి. అంతే కాదు బక్త్‌వాంగ్ గ్రామంలో అందరి కంటే అందగాడు కూడా అతనే అంటూ కితాబిస్తోంది. దాదాపు పద్దెనిమిది సంవత్సరాల క్రితం మార్నింగ్ వాక్‌కి వెళుతూ రుక్మిణిని చూసిన జియోనా ఆమెకి ఉత్తరం రాసాడు. ఆమెకి అభ్యంతరం లేకపోతే వివాహం చేసుకుంటానన్నది దానిలోని సారాంశం. దానికి రుక్మిణి అంగీకరించడంతో వారి వివాహం జరిగిపోయింది. తమది ఎంత పెద్ద కుటుంబమైనా అందరూ ఒకే మాట మీద ఉంటామని, అందరి మధ్య చక్కటి అవగాహన ఉందని జియోనా చనా మరో భార్య హంతర్న్‌గంకీ అంటోంది. 39 మంది భార్యలను వివాహం చేసుకున్న జియోనా తాను ఇప్పటికీ పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, ఇది ఆగదని అంటున్నాడు. అవసరం అయితే వధువుల కోసం తాను యుఎస్‌కి కూడా వెళతానని అంటున్నాడు. భగవంతుడు తనకి పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని, తన క్షేమం కోరుకునే వారు ఇంతమంది ఉండడం తాను చేసుకున్న అదృష్టమంటున్నాడు.

- దుర్గాప్రసాద్ సర్కార్