అమృత వర్షిణి

ఏకబిగిన పది నెలలు... ( అవిశ్రాంతంగా ఎగిరే స్విఫ్ట్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి ఏకధాటిగా ఎన్ని గంటలు పని చేయగలడు? సాధారణంగా అయితే ఎనిమిది గంటలు. పట్టుదలగా, చేయాలని చేస్తే మరికొన్ని గంటలు. ఇక జంతువులు ఎన్ని గంటల పాటు తిండి, నిద్ర లేకుండా ఉండగలవు? మహా అయితే ఒకటి రెండు రోజులు. అంత కంటే మరింత ఎక్కువ సమయం అయితే వాటి శరీరం తట్టుకోలేదు. కానీ యూరప్‌కి చెందిన ఒక పక్షి అయితే ఏకంగా పది నెలల పాటు భూమీద వాలకుండా ఎగురుతూనే ఉంటుంది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. స్విఫ్ట్ పేరు గల ఆ పక్షి జీవనశైలి ఎంతో వినూత్నంగా ఉంటుందని స్వీడన్‌కి చెందిన లండ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధక బృందం సభ్యుడు యాండర్స్ హెడెన్‌స్టార్మ్ చెబుతున్నాడు. అతి సూక్ష్మమైన గాడ్జెట్స్‌ని 13 స్విఫ్ట్ పక్షుల శరీరాలకు అనుసంధానం చేసి వాటిని విడిచిపెట్టారు పరిశోధకులు. ఆ గాడ్జెట్స్ ద్వారా ఆ పక్షులు ఏ వైపు ఎగురుతున్నదీ, ఎంత ఎత్తులో ఎగురుతున్నదీ, ఎక్కడైనా దిగుతున్నాయా? లేదా? అనే విషయాలను పరిశోధకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన అనేక కొత్త సంగతులు తెలిసాయి. అతి చిన్నవైన స్విఫ్ట్ పక్షులు ఒకసారి పైకి ఎగిరితే అవి అలా ఎగురుతూనే ఉంటాయి. స్విఫ్ట్ పక్షులు గాలిలో ఎగురుతుండగానే వాటి రెక్కల్లోని ఈకలు కొత్తవి మొలవడం కూడా గుర్తించారు. ఇవి భూమి నుండి తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ఆ ఎత్తులోనే వేల కిలోమీటర్ల మేర దూరాలు ప్రయాణిస్తాయి. ఇవి గంటకి 112 కిలోమీటర్లు వెళ్లిపోగలవు. చైనా దేశస్థులు గత నాలుగు వందల సంవత్సరాల నుండి స్విఫ్ట్ పక్షుల మాంసాన్ని ఇష్టంగా తింటూనే ఉన్నారు. ఆరు నుండి తొమ్మిది అంగుళాల పరిమాణంలో ఉండే ఈ పక్షుల రెక్కలు విచ్చుకుంటే అవి పదహారు అంగుళాల వరకు ఉంటాయి. చిలీ, అర్జెంటినా, న్యూజిలాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో కూడా కనిపించే స్విఫ్ట్ పక్షులు మన దేశంలోని కేరళకి చెందిన తట్టెకాడ్ అనే ప్రాంతంలోనూ అరుదుగా కనిపిస్తాయని తెలుస్తోంది. అడవుల్లోని ఎత్తయిన చెట్లు, శిథిల భవనాల్లోని ఇరుకైన గదుల మూలల్లో ఇవి గూళ్లు కట్టుకుని నివసిస్తాయి. ఇవి ఒక తడవకి మూడు గుడ్లు పెట్టి పొదుగుతాయి. ఇవి సుదీర్ఘంగా ఎగురుతూనే నిద్రపోగలవు.

-దుర్గాప్రసాద్ సర్కార్