S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/25/2016 - 02:36

కరీంనగర్ టౌన్, మార్చి 24: పగటిపూట త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కల మరికొద్దిరోజుల్లో జిల్లాలో నెరవేరనుంది. వచ్చే ఏప్రిల్ మాసంనుంచి 9గంటలపాటు నిరంతరాయంగా రైతాంగానికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఉత్తరవిద్యుత్ పంపిణీ అధికారులు చేస్తున్న పనులు కొలిక్కివస్తున్నాయి.

03/25/2016 - 02:35

హైదరాబాద్/ తాండూరు, మార్చి 24: కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటున్న భార్య తనపై కేసు పెడుతుందని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు నిప్పంటించి, తాను అత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన గురువారం తెల్లవారు జామున రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలోని జినుగుర్తిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఒకరు గాయాలతో బయటపడ్డారు. పోలీసులు, కుటుంబీకులు కథనం ప్రకారం..

03/25/2016 - 02:34

వరంగల్, మార్చి 24: రోహిత్ మృతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ యూనివర్సిటీ విసి అప్పారావును వెంటనే రీకాల్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ డిసిసి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీల్లో గొడవలు జరగడానికి పరోక్షంగా కేంద్రమే కారణమన్నారు.

03/25/2016 - 02:34

శాంతినగర్, మార్చి 24: మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని రాజోళి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తుంగభద్ర నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. రాజోళి ఎస్‌ఐ జయశంకర్ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

03/25/2016 - 02:32

హుజూర్‌నగర్, మార్చి 24: రాష్ట్రంలో ప్రజలు, పశువులకు నీరు, రైతులు, కూలీలకు ఉపాధి పనులు కల్పించడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని పిసిసి చీఫ్, నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ ఎమ్మెల్యే కెప్టెన్ యన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం హుజూర్‌నగర్‌లోని తన నివాసంలో పత్రికల వారితో మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెపుతున్నా చేతలలో శూన్యమని అన్నారు.

03/25/2016 - 02:07

వరంగల్/నల్లగొండ, మార్చి 24: భానుడి భగభగలకు పశుపక్ష్యాదులతోపాటు మనుషులు కూడా అల్లాడుతున్నారు. వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఆరుగురు వ్యక్తులు వడదెబ్బతో మరణించారు. వరంగల్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ముసునూరి నాగమ్మ (55) బుధవారం మిరప కాయలు ఏరేందుకు కూలీకి వెళ్లి, ఇంటికి వచ్చిన అస్వస్థతకు గురై గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.

03/25/2016 - 02:07

హైదరాబాద్, మార్చి 24: దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల మీద ఒక పథకం ప్రకారం తీవ్రస్థాయిలో దాడి జరుగుతోందని జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఆరోపించారు. ఎఐటియుసి కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ దేశభక్తి అంటే నరేంద్రమోదీ భక్తి కాదని, అలాగే భారత పతాకం అంటే కాషాయ పతాకం కాదని, భారత పతాకంలో మూడు రంగులుంటాయని కన్హయ్య కుమార్ వ్యాఖ్యానించాడు.

03/25/2016 - 02:10

హైదరాబాద్, మార్చి 24: హైదరాబాద్‌లో ఉగ్రవాదుల దాడులు చేసేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలు, భవనాలు 125 ఉన్నాయని తెలంగాణ పోలీసు శాఖ గుర్తించింది. ఇందులో అతి ముఖ్యమైన ప్రాంతాలు, భవనాలు, వాణిజ్య కేంద్రాలు, రక్షణ దళ ఎస్టాబ్లిష్ మెంట్లు ఉన్నాయి. ఉగ్రవాద దాడులను తిప్పిగొట్టేందుకు అక్టోపస్ సంస్ధను ఏర్పాటు చేశారు.

03/25/2016 - 02:02

హైదరాబాద్, మార్చి 24: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ అప్పారావు ఛాంబర్‌పై దాడికి పాల్పడిన ఘటనలో బుధవారం ఇద్దరు సిబ్బంది సహా 27 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మియాపూర్ కోర్టులో హాజరు పరచి చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా విద్యార్థులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది.

03/25/2016 - 02:02

హైదరాబాద్, మార్చి 24: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఆహారం, నీరు ఇవ్వడం నిలిపివేశారనే ఆరోపణల్లో నిజం లేదని విసి అప్పారావు స్పష్టం చేశారు. వర్శిటీలో విద్యార్థులను ఇబ్బంది పెట్టామనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

Pages