తెలంగాణ

విసి చాంబర్ విధ్వంసం కేసు బెయల్‌పై విచారణ 28కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ అప్పారావు ఛాంబర్‌పై దాడికి పాల్పడిన ఘటనలో బుధవారం ఇద్దరు సిబ్బంది సహా 27 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మియాపూర్ కోర్టులో హాజరు పరచి చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా విద్యార్థులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. జెఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చెప్పులతో దాడికి దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని గోసంరక్షణ సమితికి చెందిన నవీన్, పవన్‌రెడ్డిలుగా గుర్తించారు. వీరిని రిమాండ్‌కు తరలించగా నాంపల్లి కోర్టు వీరికి బెయిలు మంజూరు చేసింది.