తెలంగాణ

సాకారం దిశగా ‘పగటి’ కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మార్చి 24: పగటిపూట త్రీఫేజ్ విద్యుత్ సరఫరా కల మరికొద్దిరోజుల్లో జిల్లాలో నెరవేరనుంది. వచ్చే ఏప్రిల్ మాసంనుంచి 9గంటలపాటు నిరంతరాయంగా రైతాంగానికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఉత్తరవిద్యుత్ పంపిణీ అధికారులు చేస్తున్న పనులు కొలిక్కివస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే ప్రయోగాత్మక సరఫరా కొనసాగుతుండగా, పూర్తిస్థాయిలో దీనిని విజయవంతం చేసేందుకు విద్యుత్ అధికారులు వడివడిగా ముందుకుసాగుతున్నారు. ఏకధాటిగా 9గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తుంటే ఎదురయ్యే అంతరాయాలపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రయోగాత్మక విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ నుంచే రైతులకు పగటిపూట విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు గడువుకు ముందే పనులు పూర్తిచేసి, విద్యుత్ సరఫరాచేయాలనే దృఢసంకల్పంతో ఉన్నారు. జిల్లాలోప్రస్తుతం 2.30 లక్షలకు పైగా విద్యుత్‌కనెక్షన్లు ఉన్నాయి. వీటిని ఫీడర్లవారీగా విభజించి రాత్రింబవళ్ళు కలిపి వ్యవసాయ అవసరాల నిమిత్తం ఆరుగంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే, ఒకేసారి పెద్దమొత్తంలో పంపుసెట్లు ప్రారంభించటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం అనివార్యమైంది. ఈక్రమంలోదీనిని అరికట్టి నిరంతరంగా విద్యుత్ అందించేందుకు కేంద్రప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఐపిడి ఎస్, గ్రామీణ ప్రాంతాల్లో దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణజ్యోతి యోజన పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటితోగత కొంతకాలంగా విద్యుత్ సరఫరాలో ఎదుర్కొంటున్న ఆటుపోట్లు తగ్గిపోయి, నాణ్యమైన విద్యుత్ సరఫరాచేసేందుకు మార్గం సుగమం అయినట్లైంది. ఈపథకాల్లో భాగంగా రాష్ట్రానికి మంజూరైన విద్యుత్ ఉపకరణాలను సద్వినియోగం చేసుకుని పగటిపూట 9గంటలపాటు విద్యత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 298 సబ్‌స్టేషన్ల పరిధిలో ఇందుకు కావాల్సిన పరికరాలు బిగిస్తున్నారు. 544 ఫీడర్లకు ప్రత్యేక బ్రేకర్లు ఏర్పాటు చేస్తుండగా, 3.15 ఎంవిఎ కెపాసిటీ గల 20 పిటిఆర్‌లు, 159 5ఎంవిఎ పిటిఆర్‌లు, 8 ఎంవిఎ పిటిఆర్‌లు 3 ఏర్పాటు చేసేందుకు అధికారులు పనులు నిర్వహిస్తున్నారు. గత ఆరుమాసాల నుంచే పనులు చేపడుతున్నా ఇప్పటివరకు సగంవరకు మాత్రమే పనులు పూరె్తైనట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. పరికరాల బిగింపులో మందకొడితనం నెలకొనగా, గడువులోగా పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన మేరకు సామాగ్రి సకాలంలో జిల్లాకు చేరకపోవడంతోనే బిగింపులో జాప్యం నెలకొందని ట్రాన్స్‌కో ఎస్‌ఈ రంగారావు తెలిపారు.