తెలంగాణ

దేశభక్తి అంటే మోదీ భక్తి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల మీద ఒక పథకం ప్రకారం తీవ్రస్థాయిలో దాడి జరుగుతోందని జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఆరోపించారు. ఎఐటియుసి కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ దేశభక్తి అంటే నరేంద్రమోదీ భక్తి కాదని, అలాగే భారత పతాకం అంటే కాషాయ పతాకం కాదని, భారత పతాకంలో మూడు రంగులుంటాయని కన్హయ్య కుమార్ వ్యాఖ్యానించాడు. తొలుత హెచ్‌సియు సంఘటన జరిగిందని, తర్వాత జెఎన్‌యులో విద్యార్థులను తప్పుబట్టారని కన్హయ్య అన్నారు. పోనీ ఈ రెండింటినీ పక్కనపెడితే అలీఘడ్ యూనివర్శిటీ మైనార్టీ హోదాను తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మొత్తంగా విద్యార్థుల ఆందోళనను 3డీ లెజిటిమేట్2 చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
జస్టిస్ ఫర్ రోహిత్ వేముల ఆందోళనను ఢిల్లీలో కొనసాగించాలని ముందుగా నిర్ణయించుకున్నామని, అంతలోనే అక్కడ కూడా ఘటనలు జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి తాను విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడానని తెలిపారు. ఇక్కడి నుండి ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ జెఎసి ప్రారంభించామని, నిరసన ప్రదర్శనలు, బహిరంగ సభ కూడా నిర్వహించామని అన్నాడు. రోహిత్ వేముల ఆందోళనకు జెఎన్‌యులో జరిగిన ఆందోళన కేవలం కొనసాగింపు మాత్రమేనని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఈ రెండు ఘటనలను ఒకదానికొకటి పోటీగా మార్చాలని చూసిందని అన్నారు. తాను జైలు నుండి విడుదలైన తర్వాత కూడా తనకు ఆదర్శప్రాయుడు అఫ్జల్ గురు కాదని, రోహిత్ వేములేనని స్పష్టం చేశారు. తాను హెచ్‌సియుకు రావాలని ముందుగానే నిర్ణయించుకున్నానని, కాని అనుకోకుండా జరిగిందో, కావాలని చేశారో గాని తాను రావడానికి ముందే అప్పారావు మళ్లీ వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారని కన్హయ్య వ్యాఖ్యానించారు. ఆయన మద్దతుదారులు దండలతో స్వాగతం పలికారని, తర్వాత శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న విద్యార్థులను రెచ్చగొట్టడంతో హింసాత్మక సంఘటనలు జరిగాయని చెప్పారు. తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని, హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోనని పేర్కొన్నారు. కానీ ఇక్కడ మాత్రం విద్యార్థినులను మగ పోలీసులతో కొట్టించారని, విద్యుత్, ఇంటర్‌నెట్, మెస్‌లను మూసివేశారని చివరికి అధ్యాపకులను కూడా కొట్టి అరెస్టు చేసి జైలులో పెట్టారని అన్నారు. పోలీసులు తొలుత నన్ను యూనివర్శిటీలోకి అనుమతించాలనే అనుకున్నారని, తర్వాత అంతర్గత భద్రత సమస్యల వల్ల పంపలేకపోతున్నామని చెప్పారని, ఆ అంతర్గత భద్రత సమస్య ఎవరి వల్ల వచ్చింది? భద్రతను భంగపరిచింది ఎవరు? అని కన్హయ్య నిలదీశారు. ఇదంతా చూస్తుంటే ప్రొఫెసర్ అప్పారావును పక్కా ప్రణాళికతోనే హెచ్‌సియుకు రప్పించారని అర్థం అవుతోందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడే వారిపై దేశద్రోహ ముద్ర వేయడం దారుణమని అన్నారు. రోహిత్ ఘటనను మరుగుపరిచేందుకే జెఎన్‌యులో సంఘటనలను కేంద్రప్రభుత్వం వివాదాస్పదం చేసిందని కన్హయ్య మండిపడ్డారు. జెఎన్‌యు-హెచ్‌సియుల్లో జరిగిన విద్యార్థి ఉద్యమాలకు ఒకే రకమైన పోలిక కనిపిస్తోందని అన్నారు.
విశ్వవిద్యాలయాల్లో కులం, మతం ప్రాతిపదికన విద్యార్థులు బహిష్కరించుకోవడం శోచనీయమని అన్నారు. ఇలాంటి ఘటనలు నిలువరించేందుకే రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. బిజెపి, ఆరెస్సెస్, ఎబివిపి తదితర మతోన్మాద శక్తులు తమ భావజాలాన్ని విశ్వవిద్యాలయాల్లో వ్యాప్తి చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. చైతన్యవంతమైన విద్యార్థి లోకం ఇలాంటి దుశ్చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాతంత్ర, అభ్యుదయ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు కృషి చేయాలని అన్నారు. 3హింసను సృష్టించేందుకు నేను ఇక్కడికి రాలేదు... అది మా విధానం కానే కాదు2 అని కన్హయ్య వ్యాఖ్యానించారు. శాంతియుత పద్ధతుల్లో రోహిత్ స్మారక స్థూపానికి నివాళులు అర్పించేందుకే తాము వచ్చామని తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని కన్హయ్య అన్నారు.

చిత్రం హైదరాబాద్‌లో గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్