S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/23/2016 - 11:59

హైదరాబాద్: రామాయంపేట మండలం నిజాంపేటలో మంగళవారం అర్ధరాత్రి కొందరు దుండగులు ఇండిక్యాష్ సంస్థకు చెందిన ఏటిఎంను ధ్వంసం చేసి నగదు తీసుకుపోయారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఏటిఎం కేంద్రం వద్ద దుండగులు బీభత్సం సృష్టించినట్లు కనుగొన్నారు.

03/23/2016 - 11:58

హైదరాబాద్: అనుమానం పెనుభూతంగా మారి గణేష్ అనే వ్యక్తి తన భార్య వరలక్ష్మి తలపై బండరాయితో మోదీ హత్య చేశాడు. నగరంలోని నేరేడ్‌మెట్ ప్రగతినగర్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. భార్యాభర్తలిద్దరూ కొంతకాలంగా గొడవలు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

03/23/2016 - 11:58

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ వద్ద వాటర్ ట్యాంకులో ఓ విద్యార్థి మృతదేహాన్ని బుధవారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మిగతా విద్యార్థులను ఆరా తీస్తున్నారు.

03/23/2016 - 08:14

హైదరాబాద్: పంచాయితీలను బలోపేతం చేయాలని, 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీలకు అధికారాలను బదలాయించాలని నిర్ణయించినా అమలు చేయడం లేదని, అధికారాలు బదలాయించాలని వివిధ రాజకీయ పక్షాల సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

03/23/2016 - 08:13

హైదరాబాద్: కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే నీటి ప్రాజెక్టులకు రీ-డిజైన్ చేపట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే నీటి ప్రాజెక్టులకు రీ-డిజైన్ చేపట్టారని ఆయన విమర్శించారు.

03/23/2016 - 08:09

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది వాణిజ్యపన్నుల శాఖ ద్వారా ఆదాయం రూ.30 వేల కోట్లకు చేరుకుంటుందని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఈ ఆదాయాన్ని వినియోగించనున్నట్లు వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రకటించారు.

03/23/2016 - 08:08

హైదరాబాద్: దేశంలో అతిపెద్ద పార్క్ నిర్వాహక సంస్థ ‘వండర్ లా’ ఇప్పుడు నగరవాసులను అలరించనుంది. దేశంలోని తన మూడో అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుంది. ఈ మేరకు రూ. 250 కోట్ల ఖర్చుతో అద్భుతమైన పార్క్‌ను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే బెంగుళూరు, కొచ్చిల్లో పదేళ్లుగా ఆ సంస్థ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

03/23/2016 - 08:07

హైదరాబాద్: ఏపి అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ప్రివిల్లేజస్ కమిటీ ముందుకు హాజరవుతారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు నేపథ్యంలో మంగళవారం వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో, ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. ప్రివిల్లేజస్ కమిటీ ముందు రోజా హాజరు కావాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

03/23/2016 - 08:06

హైదరాబాద్: హెల్మెట్ ధారణపై సుప్రీం కోర్టు ఆదేశాలను హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరిగా కలిగివుండాలని సూచిస్తున్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి జరిమానా విధిస్తూ, కౌనె్సలింగ్ కూడా ఇస్తున్నారు.

03/23/2016 - 05:53

హైదరాబాద్: అసెంబ్లీలో మంగళవారం నాడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన పద్దులపై చర్చ జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ సభ్యురాలు డికె అరుణ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఒక దశలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కంట తడి పెట్టారు. ప్రాజెక్టులకు కేటాయించిన పద్దులపై కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క ప్రసంగించారు.

Pages