S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/25/2016 - 02:01

మహబూబాబాద్, మార్చి 24: వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన సంకెపెల్లి సాయినాథ్‌రెడ్డి అమెరికాలో మే 18 నుండి 22వ తేది వరకు జరుగు నాసా సైన్స్ కాన్ఫరెన్స్‌కు ఎన్నికయ్యారు. సాయినాథ్‌రెడ్డి హైదరాబాద్‌లోని చైతన్య టెక్నో పాఠశాల, ఈసిఐఎల్ బ్రాంచిలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు.

03/25/2016 - 01:59

హైదరాబాద్, మార్చి 24: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయం విసి అప్పారావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సియూలో అరెస్టయిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

03/25/2016 - 01:58

హైదరాబాద్, మార్చి 24: వేముల వాడ ఆలయ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి తరహాలో వేములవాడను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. దక్షిణ కాశీగా పేరు పొందిన వేముల వాడ అభివృద్ధిపై రూపొందించిన ప్రణాళికను త్వరలోనే ముఖ్యమంత్రికి చూపించి అనుమతి పొందుతారు.
పైలట్ శిక్షణకు 35 లక్షలు

03/25/2016 - 01:55

హైదరాబాద్, మార్చి 24: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు హామీ ఇచ్చిన భూమి కొనుగోలు పథకం అమలుకు నిధుల కొరత, అధికారుల్లో చిత్తశుద్ధి లేమి వెంటాడుతోంది. గత రెండేళ్లలో పేద దళితులకు భూమి కొనుగోలుకు రూ. 1400 కోట్లు కేటాయించగా, ఖర్చుపెట్టింది కేవలం రూ. 259 కోట్లు మాత్రమే. బడ్జెట్‌లో నిధులు భారీగానే కేటాయిస్తున్నా, అనుకున్న లక్ష్యం సాధించడంలో ప్రభుత్వం యంత్రాంగం విఫలమవుతోంది.

03/24/2016 - 16:32

హైదరాబాద్: ఎటిఎం కేంద్రాల వద్ద పలువురిని వంచిస్తూ ఎన్నో నేరాలకు పాల్పడిన సిద్ధేశ్ అనే 25 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు గురువారం తెలిపారు. కడప జిల్లా ఇస్నాపురం గ్రామానికి చెందిన నిందితుడు నగరంలో పలు చోట్ల ఎటిఎం కేంద్రాల వద్ద నగదు తీసుకునే వారిని, నగదు డిపాజిట్ చేసేవారిని వంచించి డబ్బుతో ఉడాయించాడు.

03/24/2016 - 12:34

హైదరాబాద్: హెచ్‌సియు వైస్ చాన్సలర్ అప్పారావును సస్పెండ్ చేయనందుకు నిరసనగా ఉస్మానియా వర్సిటీలో వామపక్ష విద్యార్థి సంఘాల నేతృత్వంలో గురువారం ఆందోళన ప్రారంభించారు. హెచ్‌సియు వ్యవహారాలపై తెలంగాణ సర్కారు దృష్టి సారించడం లేదని ఆరోపిస్తూ సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు.

03/24/2016 - 12:34

హైదరాబాద్: ఎండవేడిని తట్టుకోలేక ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో గురువారం ముగ్గురు వ్యక్తులు మరణించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఇద్దరు, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఓ వ్యక్తి వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు.

03/24/2016 - 12:32

రంగారెడ్డి: ఇంట్లో నిద్రపోతున్న తల్లి, తమ్ముడు, చెల్లెలిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఓ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాండూరు మండలం జినుగుర్తిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. మంటల ధాటికి తల్లి లక్ష్మి, చెల్లెలు జ్యోతి వెంటనే మృతి చెందగా, కిరోసిన్ వాసనతో మేల్కొని బయటకు పరుగుతీసిన తమ్ముడు చంద్రప్రకాష్ ప్రాణహాని నుంచి తప్పించుకున్నాడు.

03/24/2016 - 12:32

హైదరాబాద్: రెండు రోజుల పాటు ఆందోళనలతో అట్టుడికిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గురువారం ప్రశాంత వాతావరణం కనిపించింది. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. పదిహాస్టళ్లకు సంబంధించిన మెస్‌లను తిరిగి ప్రారంభించారు. క్యాంపస్ వద్ద పోలీసు బందోబస్తును యథాప్రకారం కొనసాగిస్తున్నారు.

03/24/2016 - 08:13

హైదరాబాద్: నగరంలో మెట్రోరైలు భద్రతపై తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అధికారులతో సమావేశమయ్యారు. డిజిపి కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది హాజరయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రోరైల్ మేనేజింగ్ డైరెక్టర్, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు సివి ఆనంద్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Pages