తెలంగాణ

వేములవాడ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: వేముల వాడ ఆలయ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి తరహాలో వేములవాడను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. దక్షిణ కాశీగా పేరు పొందిన వేముల వాడ అభివృద్ధిపై రూపొందించిన ప్రణాళికను త్వరలోనే ముఖ్యమంత్రికి చూపించి అనుమతి పొందుతారు.
పైలట్ శిక్షణకు 35 లక్షలు
పైలట్ శిక్షణ కోసం సామాన్య కుటుంబానికి చెందిన శ్రావణ్ కుమార్‌కు 35లక్షల సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల తన ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో కొమురంభీమ్ సార్మక చిహ్నం నిర్మించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు స్మారక చిహ్నం నిర్మాణం కోసం 2.90 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా గోడేగావ్ వద్ద స్మారక చిహ్నం నిర్మిస్తారు.