తెలంగాణ

నాసా కాన్ఫరెన్స్‌కు మానుకోట విద్యార్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మార్చి 24: వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన సంకెపెల్లి సాయినాథ్‌రెడ్డి అమెరికాలో మే 18 నుండి 22వ తేది వరకు జరుగు నాసా సైన్స్ కాన్ఫరెన్స్‌కు ఎన్నికయ్యారు. సాయినాథ్‌రెడ్డి హైదరాబాద్‌లోని చైతన్య టెక్నో పాఠశాల, ఈసిఐఎల్ బ్రాంచిలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల నాసా, సాన్‌జోస్ స్టేట్ యూనివర్సీటి సౌజన్యంతో హైస్కూల్ నుండి కళాశాల స్థాయి నాసా ఎయిమ్స్ స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్ నిర్వహించింది. ఈ కాంటెస్ట్‌లో 20వేల మంది విద్యార్ధులు పాల్గొనగా తెలంగాణ రాష్ట్రం నుండి 3 టీంలు( టీంకు 10మంది) ఎంపికయ్యారు. అందులో ఇంద్రప్రస్థాన అనే టీంకు సాయినాథ్‌రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా సాయినాథ్ తల్లిదండ్రులు సంకెపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, కీర్తనలు గురువారం విలేఖరులతో మాట్లాడుతూ.. హైస్కూల్ స్థాయిలోనే తమ కుమారుడు ఇంతటి అద్భుత విజయాన్ని సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. సాయినాథ్ కృషికి కారణమైన చైతన్య స్కూల్ చైర్మన్ బి ఎస్ రావు, రాము, ప్రిన్సిపల్ అనిల్‌కుమార్, ఫిజిక్స్ ఉపాధ్యాయుడు ఎ ఎల్ శ్రీనివాస్‌లు కారణమని తెలిపారు. అమెరికాలో జరిగే సైన్స్ కాన్ఫరెన్స్‌లో అంతరిక్షంలో వృక్షాలు, జంతువులు, మనుషులు ఉండేందుకు స్థలాన్ని ఎంపిక చేసి వాటి మనుగడకు కాంతి, ఉష్ణోగ్రత, లవనీయత, రసాయన, నీటి సౌకర్యాలు ఏలా లభిస్తాయో ఈ కాంటెస్ట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

చిత్రం సాయినాథ్‌రెడ్డి