తెలంగాణ

ఓయూ మళ్లీ ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయం విసి అప్పారావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సియూలో అరెస్టయిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓయూలో విద్యార్థి సంఘాల ర్యాలీ, దిష్టిబొమ్మల దహనాలను అడ్డుకున్న పోలీసులు, విద్యార్థులు మధ్య తోపులాట జరిగింది.
దీంతో ఓయూలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు నవీన్, ప్రణయ్ మాట్లాడుతూ అప్పారావు హెచ్‌సియూలో విసిగా కొనసాగే అర్హత కోల్పోయారని ఆరోపించారు. విద్యార్థుల పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఆయనపై చర్య తీసుకునేంత వరకూ అతనిని పదవిలో కొనసాగనివ్వరాదని విద్యార్థులు డిమాండ్ చేశారు. పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు పాల్పడి రెండు నెలలు కావస్తున్న వర్శిటీ యాజమాన్యం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విద్యార్థి జెఎసి నాయకులు కల్యాణ్, నవీన్ నిశితంగా విమర్శించారు.