తెలంగాణ

భాగ్యనగరంపై ఉగ్రభూతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: హైదరాబాద్‌లో ఉగ్రవాదుల దాడులు చేసేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలు, భవనాలు 125 ఉన్నాయని తెలంగాణ పోలీసు శాఖ గుర్తించింది. ఇందులో అతి ముఖ్యమైన ప్రాంతాలు, భవనాలు, వాణిజ్య కేంద్రాలు, రక్షణ దళ ఎస్టాబ్లిష్ మెంట్లు ఉన్నాయి. ఉగ్రవాద దాడులను తిప్పిగొట్టేందుకు అక్టోపస్ సంస్ధను ఏర్పాటు చేశారు. తీవ్రవాద చర్యలను సమర్ధంగా తిప్పిగొట్టేందుకు రాష్ట్రంలో ఎక్కడ సంఘటన జరిగిన ఆ ప్రాంతానికి వెంటనే చేరుకునేందుకు వీలుగా అక్టోపస్‌లో దళం ఒక స్టాండ్ టు టీమ్ సిద్ధంగా ఉంటుంది. అలాగే తీవ్రవాద బెడదను ఎదుర్కొనడానికి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఒక దళం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఈ వివరాలను రాష్ట్ర హోంశాఖ పేర్కొంది.
రాష్ట్రప్రభుత్వం 2007లో కౌంటర్ టెర్రరిస్టు కార్యకలాపాల సంస్ధ అక్టోపస్‌ను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని 570 ఎకరాల విస్తీర్ణంలో అక్టోపస్ కమాండోస్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు. 2011-12 నుంచి 2015-16 వరకు విడతల వారీగా రూ. 146.64 కోట్ల నిధులను విడుదల చేశారు. ఇబ్రహీంపట్నం కమాండో శిక్షణ కేంద్రం వద్ద వివిధ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇందులో ఇంతవరకు రూ. 66.16కోట్లను మాత్రమే ఖర్చుపెట్టారు. నిధుల కొరత అక్టోపస్‌ను వెంటాడుతోంది. వచ్చే ఏడాది బడ్జెట్‌లో రూ. 78.33 కోట్ల నిధులను కేటాయించారు.
ఉగ్రవాదులు దాడులు చేసేందుకు ఎన్నుకునే ప్రదేశాల్లో హైదరాబాద్ ఒకటి. అదృష్టవశాత్తు నాలుగేళ్లుగా జంటనగరాల్లో ఉగ్రవాదులు ఎటువంటి దాష్టీకానికీ పాల్పడలేదు. ఉగ్రవాదుల కదలికలను గుర్తించి, పట్టుకోవడంలో తెలంగాణ పోలీసులు ప్రావీణ్యం సంపాదించినా ‘ఆక్టోపస్’లో ఇంకా వౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది. నాలుగు విభాగాలున్న ఆక్టోపస్‌లో ప్రస్తుతం 200 మంది కమాండోలు మాత్రమే ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో అక్టోపస్ కార్యాలయానికి సంబంధించి ప్రహరీ, బెల్ ఆఫ్ ఆర్మీ, బ్యారెక్‌లు, శిక్షణ బ్లాక్ భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా వివిధ నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పరేడ్ గ్రౌండ్స్, మంచినీటి సదుపాయం, విద్యుద్దీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం బేగంపేటలో ప్రధాన కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్టోపస్‌లో అసాల్ట్ టీం, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లతో ఏర్పాటవుతుంది. 1590 మంది కమాండోలకు శిక్షణ ఇచ్చేందుకు గతంలో ఏపి ప్రభుత్వం మంజూరు చేసింది. విభజన తర్వాత ఇక్కడ ఉన్న కమాండోలను ఇరు రాష్ట్రాలకు పంపకం చేశారు. హైదరాబాద్‌కు ఉగ్రవాదులతో ముప్పు ఉన్న నేపథ్యంలో కనీసం వెయ్యి మంది కమాండోలను రిక్రూట్ చేసి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.