తెలంగాణ

కరవు నివారణ చర్యలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, మార్చి 24: రాష్ట్రంలో ప్రజలు, పశువులకు నీరు, రైతులు, కూలీలకు ఉపాధి పనులు కల్పించడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని పిసిసి చీఫ్, నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ ఎమ్మెల్యే కెప్టెన్ యన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం హుజూర్‌నగర్‌లోని తన నివాసంలో పత్రికల వారితో మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెపుతున్నా చేతలలో శూన్యమని అన్నారు. తాను నియోజకవర్గంలో ఒకరోజు పర్యటనలోనే అనేక గ్రామాల ప్రజలు కరవు, మంచినీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, ఉపాధి హామీ పనులు లేక పోవటం వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారని అన్నారు.
శాసనసభలో కరవుపై చర్చకు పట్టుబటినా ప్రభుత్వం స్పందించలేదని, ప్రతి అంశాన్ని పెద్ద విషయంగా వేల కోట్లతో చేస్తున్నట్లు ప్రకటించుకోవడం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం బాధాకరమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు గత రెండు నెలల కింద చేసిన పనులకు నేటివరకు చెల్లింపులు చేయకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇకనైనా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రతి గ్రామంలో, పట్టణంలో కరవు నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలకు మంచినీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతని, నల్లగొండ జిల్లాలో 59 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి రైతులను, కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లాలో ప్రజలకు, పశువులకు మంచినీటి కొరత తీర్చేందుగాను ప్రభుత్వం వెంటనే నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నింపి భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. కుడి కాలువకు ఇటీవలనే మూడుసార్లు నీరు విడుదల చేశారని, ఎడమ కాలువకు నీరు విడుదల చేయడంలో జాప్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. పాలకుల, కాంట్రాక్టర్ల కమీషన్‌ల కోసం వేల కోట్లు విడుదల చేస్తున్నారని, కరవు కోసం రూపాయి కూడా విడుదల చేయలేదని ఆయన ధ్వజమెతారు.