తెలంగాణ

కుటుంబ సభ్యులకు నిప్పంటించి..ఆపై ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ తాండూరు, మార్చి 24: కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటున్న భార్య తనపై కేసు పెడుతుందని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు నిప్పంటించి, తాను అత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన గురువారం తెల్లవారు జామున రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలోని జినుగుర్తిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఒకరు గాయాలతో బయటపడ్డారు. పోలీసులు, కుటుంబీకులు కథనం ప్రకారం.. కర్నాటకలోని గుల్బర్గా జిల్లా సేడంకు చెందిన క్షీరసాగర్ రాములు తన కుటుంబంతో కలసి జీవనోపాధి కోసం జినుగుర్తికి వచ్చారు. దర్జీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాములు, లక్ష్మి దంపతులకు సత్యవిజయ్‌కుమార్, జ్యోతి, చంద్రప్రకాష్ ముగ్గురు సంతానం. ఇటీవలి కాలంలో రాములు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందాడు. నాటి నుంచి కుటుంబ బాధ్యత సత్యవిజయ్ కుమార్‌పై పడింది. దర్జీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సత్యవిజయ్‌కుమార్‌కు మూడేళ్ల క్రితం హైదరాబాద్ బేగంపేటకు చెందిన మంజులతో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు కూడా ఉన్నాడు. కాగా దర్జీ పని నడువక, కుటుంబ పోషణ భారం పెరిగి అప్పులు కావడంతో తరచూ భార్య గొడవపడేది. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో భార్య మంజుల తన తల్లిగారింటి వద్దే ఉంటోంది. సత్యవిజయ్‌కుమార్ మాత్రం కూలీ పనికి వెళుతూ తల్లి, చెల్లి, తమ్ముడిని పోషించుకుంటున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో విజయ్ భార్య తాను కాపురానికి రావాలంటే మీ తల్లి, చెల్లి, తమ్ముడిని వదిలేసి రావాలంటూ కబురు పంపేది. దీన్ని పట్టించుకోని విజయ్‌ను భార్య మరోసారి గట్టిగా మందలిస్తూ నీపై వరకట్న వ్యతిరేక కేసు పెడతానని, జైల్లో పెట్టిస్తానని బెదిరించింది. దీంతో తాను జైలు కెళితే తన చెల్లి, తల్లి, తమ్ముళ్లను ఎవరు పోషిస్తారని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎటూ పాలుపోని సత్యవిజయ్‌కుమార్ కుటుంబీకులు బుధవారం రాత్రి భోజనం అనంతరం నిద్రించారు. అర్ధరాత్రి దాటాక ఇంట్లోని 20లీటర్ల కిరోసిన్ డబ్బాలోని కిరోసిన్‌ను తల్లి, చెల్లి, తమ్ముడిపై పోసి నిప్పంటించాడు. తాను కూడా ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తల్లి లక్ష్మి, చెల్లెలు జ్యోతి మృతి చెందగా, కాలిన గాయాలతో తమ్ముడు ఇంట్లోంచి బయటకు వెళ్లి కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్లు వచ్చేసరికి లక్ష్మి, జ్యోతి మంటల్లో కాలిపోయారు. కొన ఊపిరితో వున్న సత్యవిజయ్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తాండూరు ఎఎస్పీ చందనాదీప్తి నేతృత్వంలో కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.