తెలంగాణ

నీళ్లు, కరెంట్ నిలిపి వేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఆహారం, నీరు ఇవ్వడం నిలిపివేశారనే ఆరోపణల్లో నిజం లేదని విసి అప్పారావు స్పష్టం చేశారు. వర్శిటీలో విద్యార్థులను ఇబ్బంది పెట్టామనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నెల 22న వర్శిటీ, హాస్టళ్ల నిర్వహణపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించామని, ఈ సమావేశంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితోపాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. సమావేశం జరుగుతుండగానే ఒక సంఘానికి చెందిన విద్యార్థులు దాడికి పాల్పడి ఫర్నీచర్ ధ్వంసం చేశారన్నారు. దీంతో విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. విద్యార్థులపై చర్యలు, కేసులు పోలీసుల పరిధిలోని అంశంమని ఆయన పేర్కొన్నారు. ఈనెల 23న, జరిగిన విద్యార్థుల ఆందోళనతో కొంత మేర హాస్టల్‌లో అసౌకర్యానికి గురికావచ్చన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ అప్పారావు విద్యార్థులకు ఆహారం, నీళ్లు, కరెంట్ బంద్ చేశారని విద్యార్థులకు హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని విసి అప్పారావుకు హెచ్‌ఆర్‌సి ఆదేశించింది.