S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/01/2016 - 02:56

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 30: భారీ వర్షా ల వలన తీవ్రంగా నష్టపోయిన తెలంగాణను ఆదుకునేందుకు తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు కేటాయించాలని హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

10/01/2016 - 02:56

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 30: మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ వేలాది మంది ప్రజలు శుక్రవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి, వెల్ధండ, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు సంబందించిన జెఎసి, కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దర్నాకు జనం కదంతొక్కారు.

10/01/2016 - 02:54

హైదరాబాద్, సెప్టెంబర్ 30: పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ సైనికాధికారి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. యుద్ధం అనివార్యమైతే తాను యుద్ధంలో పాల్గొంటానని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు సైన్యాధికారిగా పని చేసిన అనుభవాలను కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు.

10/01/2016 - 02:53

నిజాంసాగర్, సెప్టెంబర్ 30: ని జాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలో కి శుక్రవారం నుండి 21వేల క్యూసెక్కు ల వరదనీరు వస్తుండటంతో రాత్రి 2గంటల సమయంలో రెండు వరదగేట్లను ఎత్తివేసి, వరదనీటిని దిగువ మంజీరద్వారా గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు డిప్యూటిఇఇ సురేష్‌బాబు తెలిపారు.

09/30/2016 - 05:12

హైదరాబాద్/ ఉప్పల్, సెప్టెంబర్ 29: సర్వే మ్యాపింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూగర్భ శాస్త్ర శాఖ సహాయ మంత్రి వై.సుజనా చౌదరి అన్నారు. సర్వే ఆఫ్ ఇండియాలో విభజన జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల కార్యాలయాలను గురువారం ఉప్పల్‌లోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో ప్రారంభించారు.

09/30/2016 - 05:07

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ఇటీవల కురిసిన వర్షాలతో 17 వందల కిలోమీటర్ల పరిధిలో 1524 రోడ్లు దెబ్బతిన్నాయి. తక్షణం వీటి మరమ్మతు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక, శాశ్వత మరమ్మతులకు కావలసిన నిధులపై ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి ఇతర అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

09/30/2016 - 05:06

సిరిసిల్ల, సెప్టెంబర్ 29: అధికార టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ బూట్ల రుక్కుంబాయి, ఆమె భర్త పద్మశాలి, వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బూట్ల సుదర్శన్ రాజీనామా సమర్పించారు.

09/30/2016 - 05:01

హైదరాబాద్, సెప్టెంబర్ 29: రాజధానిలో గురువారం కూడా జిహెచ్‌ఎంసి నాలాలు, చెరువుల్లో వెలసిన ఆక్రమణలను కూల్చివేసింది. గడిచిన నాలుగురోజులుగా ఎంతో జోరుగా కొనసాగుతున్న ఈ కూల్చివేతలకు గురువారం ఊహించని తరహాలో రాజకీయ అడ్డంకులు ఎదురయ్యా యి. దీనికి తోడు టౌన్‌ప్లానింగ్ అధికారుల అవినీతి, అలసత్వం, కూల్చివేతల్లో వివక్ష ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.

09/30/2016 - 05:01

హైదరాబాద్, సెప్టెంబర్ 29: హైదరాబాద్‌లోని యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు సిరియా ఇస్లామిక్ స్టేట్ చీఫ్ షఫీ ఆర్మర్ పది పేర్లను, మూడు యాప్‌లను వినియోగించేవాడు. సిరియా నుంచి వివిధ పేర్లతో భారత్‌లోని యువతలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రేరేపించినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రత్యేకించి హైదరాబాద్ యువతను ఆకర్షించేందుకు మూడు యాప్‌లను వినియోగించే వాడని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

09/30/2016 - 05:00

హైదరాబాద్, సెప్టెంబర్ 29: రాష్ట్రంలోని జలాశయాల్లో 2016-17 లో 35 కోట్ల చేపపిల్లల పెంపకానికి ప్రభు త్వం 37 కోట్ల రూపాయలు వ్యయం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 4,553 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల నేతృత్వంలోని చెరువులు, కుంటలు, ఇతర రిజర్వాయర్లలో ఉచితంగా సరఫరా చేసే చేపపిల్లలను పెంచాలని నిర్ణయించారు.

Pages