తెలంగాణ

35కోట్ల చేప పిల్లలు ఉచితంగా పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: రాష్ట్రంలోని జలాశయాల్లో 2016-17 లో 35 కోట్ల చేపపిల్లల పెంపకానికి ప్రభు త్వం 37 కోట్ల రూపాయలు వ్యయం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 4,553 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల నేతృత్వంలోని చెరువులు, కుంటలు, ఇతర రిజర్వాయర్లలో ఉచితంగా సరఫరా చేసే చేపపిల్లలను పెంచాలని నిర్ణయించారు. మత్స్యశాఖమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సచివాలయం నుండి గురువారం జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయాలు వెల్లడించారు. ఈ పర్యాయం జలాశయాలు అన్నీ నీటితో నిండటంతో చేపల పెంపకానికి అనుకూలవాతావరణం ఏర్పడ్డదన్నారు. 35 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసేందుకు తమ ప్రభుత్వం నిర్ణయించిందని, గత ఏడాదితో పోలిస్తే ఇవి రెట్టింపన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపపిల్లల పెంపకానికి టెండర్లు పిలవగా ఒకరూపాయి 22 పైసలకు ఒక చేపపిల్లను సరఫరా చేసేందుకు టెండర్లు వచ్చాయని, రెండోసారి నిర్వహించిన టెండర్లలో కేవలం ఒక చేపపిల్లను 90 పైసలకే సరఫరా చేసేందుకు సరఫరాదారులు ముందుకు వచ్చారన్నారు. ఈ మేరకు చేపపిల్లల సరఫరాదారులతో ప్రభుత్వం ఒప్పం దం కుదుర్చుకుందన్నారు. జిల్లాస్థాయిలో ఉండే మత్స్యశాఖాధికారులు యుద్ధప్రాతిపదికన లబ్ధిదారులను గుర్తించాలని, ఏయే చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఎంత మేరకు చేపపిల్లల అవసరం ఉంటుం దో వివరాలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మత్స్యకారులు లబ్ధి పొందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని మంత్రి తలసాని తెలిపారు. అక్టోబర్ 2 నుండి 14 వరకు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మంత్రి తలసాని వివిధ జిల్లాలకు వెళ్లే తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 2 న నల్లగొండ, 3 న ఆదిలాబాద్, 4 న మహబూబ్‌నగర్, 5 న మెదక్, ఆరున కరీంనగర్, ఏడో తేదీన ఖమ్మం, 8 న రంగారెడ్డి, 13 న నిజామాబాద్, 14 న వరంగల్ జిల్లాల్లో జరిగే ఉచిత చేపపిల్లల పంపిణీలో మంత్రిపాల్గొంటారు.