S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/28/2016 - 07:47

నల్లగొండ, సెప్టెంబర్ 27: గ్యాంగ్‌స్టర్ నరుూంతో సంబంధాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార, విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వపరంగా భద్రతాపరమైన అంశాలపై కోత పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ టిఆర్‌ఎస్ నేత రివాల్వర్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ రివాల్వర్‌ను పోలీస్ శాఖ స్వాధీనపరుచుకోవాలంటూ జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

09/28/2016 - 07:47

హైదరాబాద్, సెప్టెంబర్ 27: నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) అధికారులు వేగవంతం చేశారు. రెండోరోజు మంగళవారం సాయంత్రానికి 204 అక్రమ కట్టడాలను నేలమట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.

09/28/2016 - 07:46

జగదేవ్‌పూర్, సెప్టెంబర్ 27: రాష్టమ్రుఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో మంగళవారం పర్యటించారు. ఈసందర్భంగా ఎర్రవల్లి-నర్సన్నపేట మధ్య కూడేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంతో పాటు ఎర్రకుంట, మైశిరెడ్డికుంట, లింగరాజ్‌కుంట, పాండురంగారిజర్వాయర్‌లను సిఎం పరిశీలించారు.

09/28/2016 - 07:22

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణలో తొలి భారీ రిక్రూట్‌మెంట్ నిర్వహణకు పబ్లిక్ సర్వీసు కమిషన్ సన్నద్ధమవుతోంది. గ్రూప్-2 స్థాయిలోని 1032 పోస్టుల భర్తీకి 7,91,964 దరఖాస్తులు వచ్చాయి. తొలుత 439 పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌కు స్పందనగా 5,62,715 దరఖాస్తులు రాగా, తర్వాత ఇచ్చిన అదనపు 593 పోస్టులకు మరో 2,29,249 దరఖాస్తులు వచ్చాయి.

09/28/2016 - 07:06

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ వ్యాప్తంగా చెరువులు, కుంటలు ప్రాజెక్టులు నిండి పొంగిపొర్లుతుండడంతో ఎక్కడ చూసినా జల జాతర జరుగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు కురవడం చెరువులు నిండడంతో గంగమ్మతల్లి పూజలు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి పిలుపు ఇచ్చారు. మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ కరీంనగర్‌లో గంగమ్మతల్లి పూజ చేశారు. అదే విధంగా మంత్రులు తమ తమ జిల్లాల్లో పూజలు చేశారు.

09/28/2016 - 07:06

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణలో నైరుతీ రుతుపవనాలు బలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. అలాగే తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి తెలంగాణ వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం విస్తరించి ఉందని వెల్లడించారు. అదే సమయంలో బంగాళాఖాతం ఉత్తర ప్రాంతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో 3.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల తుపాన్ ద్రోణి ఏర్పడి ఉందని వివరించారు.

09/28/2016 - 07:00

హైదరాబాద్, సెప్టెంబర్ 27: రెండు వారాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల వల్ల వాటిల్లిన నష్టంపై రెవిన్యూశాఖ కసరత్తు చేస్తోంది. మొదటి వారంలో కురిసిన వర్షాల వల్ల కలిగిన నష్టంపై కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక సమాచారం అందింది. అయితే రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నీట మునిగిన పంటల వల్ల కలిగిన నష్టాన్ని అధికారులు సేకరిస్తున్నారు.

09/28/2016 - 06:56

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణలో జిల్లాల పునర్విభజన హైకోర్టు ఇచ్చే తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉండాలని, ఈ అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, జిల్లాల పునర్విభజనపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.

09/27/2016 - 03:49

కరీంనగర్, సెప్టెంబర్ 26: భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే, ఈ అనుభవాలతో భవిష్యత్‌లో అనర్థాలు జరుగకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. వరద ప్రాంతాలలో పర్యటించేందుకు జిల్లాకు వచ్చిన సిఎం సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

09/27/2016 - 03:49

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 26: నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, అందని ప్రభుత్వ పథకాలు, భారంగా మారిన కుటుంబపోషణ వెరసి సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. వరుసగా కురుస్తున్న వర్షాలతో నిండిన జలాశయాలతోపాటు తెగిన మిడ్‌మానేరు కట్టను పరిశీలించేందుకు సిఎం కెసిఆర్ జిల్లాకు వచ్చారు.

Pages