తెలంగాణ

పది మారు పేర్లు.. మూడు యాప్‌లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: హైదరాబాద్‌లోని యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు సిరియా ఇస్లామిక్ స్టేట్ చీఫ్ షఫీ ఆర్మర్ పది పేర్లను, మూడు యాప్‌లను వినియోగించేవాడు. సిరియా నుంచి వివిధ పేర్లతో భారత్‌లోని యువతలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రేరేపించినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రత్యేకించి హైదరాబాద్ యువతను ఆకర్షించేందుకు మూడు యాప్‌లను వినియోగించే వాడని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. ఐఎస్ చీఫ్ ఆర్మర్ తనకు తానుగా కొత్త పేర్లతో యువతకు యాప్ ద్వారా పరిచయమయ్యేవాడు. చోటాముల్లా, అహ్మద్ అలీ, అంజన్ భాయ్, నౌక్వా, యూసుఫ్ ఆల్ హింది, గుమ్‌నామ్, షఫీ వంటి మారు పేర్లతో యువతను రిక్రూట్ చేసుకునేవాడని ఇటీవల అరెస్టయిన ఇద్దరు ఐసిస్ సానుభూతిపరులు అర్షద్, ఖాదిర్‌లను విచారించగా వెల్లడైనట్టు ఎన్‌ఐఏ పేర్కొంది. హైదరాబాదీలతో టచ్‌లో ఉంటూ వాట్సాప్‌లను వినియోగించకుండా ట్రిలియాన్, సుర్‌స్పాట్, నింబస్ అనే యాప్‌లను షఫీ ఆర్మర్ వినియోగించేవాడని దర్యాప్తులో తేలింది. సైబర్ సెక్యూరిటీ విభాగం ఈ మూడు యాప్‌లపై దర్యాప్తు కొనసాగిస్తోందని, ఈ యాప్‌లలో అర్షద్‌కు సన్నిహితుడైన వెస్ట్‌బెంగాల్ నివాసి ఆశిక్ అహ్మద్ అలియాస్ రాజుతో చర్చలు జరిపేవాడని, యాప్స్ హ్యాకింగ్‌కు పాల్పడే వారని తెలంగాణ పోలీసులు గుర్తించినట్టు ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం.