తెలంగాణ

దెబ్బతిన్న రోడ్లు 1524

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ఇటీవల కురిసిన వర్షాలతో 17 వందల కిలోమీటర్ల పరిధిలో 1524 రోడ్లు దెబ్బతిన్నాయి. తక్షణం వీటి మరమ్మతు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక, శాశ్వత మరమ్మతులకు కావలసిన నిధులపై ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి ఇతర అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక మరమ్మతులకు 49.61 కోట్ల రూపాయలు, పూర్తి స్థాయి నిర్మాణాల కోసం 318.58 కోట్ల రూపాయలు కావాలని అధికారులు అంచనా వేశారు. వర్షాలతో 73 భవనాలు దెబ్బతిన్నాయని, వీటి మరరమ్మతులకు 3.44 కోట్ల రూపాయలు అవసరం అని అంచనా వేశారు. తెగిపోయిన 530 రోడ్లకు తక్షణమే మరమ్మతులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అత్యిధికంగా మెదక్ జిల్లాలో 402, నల్లగొండలో 358, రంగారెడ్డి జిల్లాలో 225, వరంగల్‌లో 91, ఖమ్మం 91, నిజామాబాద్‌లో 38 పంచాయితీరాజ్ రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. ఇక మెదక్‌లో 41 భవనాలు, మహబూబ్‌నగర్‌లో 15, రంగారెడ్డిలో ఆరు, నల్లగొండలో ఆరు, ఖమ్మంలో నాలుగు, కరీంనగర్‌లో ఒక భవనం దెబ్బతింది. వీటి తాత్కాలిక మరమ్మతు కోసం 55లక్షలు, పూర్తి స్థాయి నిర్మాణం కోసం 2.89 కోట్ల రూపాయలు అవసరం అని పంచాయితీరాజ్ శాఖ అధికారులు అంచనా వేశారు.
రంగారెడ్డి జిల్లాలో నాలా ఆక్రమణలను తక్షణమే తొలగించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఆక్రమణదారులపై అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో నాలాల ఆక్రమణ, అనుమతులు లేని నిర్మాణాలు, అనుమతి లేని లేఅవుట్లకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని పంచాయితీరాజ్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు.

చిత్రం.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు