తెలంగాణ

కూల్చివేతలకు రాజకీయ అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: రాజధానిలో గురువారం కూడా జిహెచ్‌ఎంసి నాలాలు, చెరువుల్లో వెలసిన ఆక్రమణలను కూల్చివేసింది. గడిచిన నాలుగురోజులుగా ఎంతో జోరుగా కొనసాగుతున్న ఈ కూల్చివేతలకు గురువారం ఊహించని తరహాలో రాజకీయ అడ్డంకులు ఎదురయ్యా యి. దీనికి తోడు టౌన్‌ప్లానింగ్ అధికారుల అవినీతి, అలసత్వం, కూల్చివేతల్లో వివక్ష ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. గురువారం వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కూల్చివేతలకు అధికార పార్టీతో పాటు విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు సైతం ప్రత్యక్షంగా, పరోక్షంగా అడ్డుకున్నారు. అంతేగాక, బాధితులు గురువారం కాప్రా మున్సిపల్ ఆఫీసును ముట్టడించేందుకు యత్నించారు. దీంతో నిన్నమొన్నటి వరకున్న కూల్చివేతల జోరు కొంత తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. టోలీచౌకీ సమీపంలోని బృందావన్‌కాలనీలో అక్రమంగా నిర్మించిన జిప్లస్ 5 అంతస్తుల భవనాన్ని కూల్చేసేందుకు వచ్చిన డెమోలిషన్ స్క్వాడ్‌ను ఎమ్మెల్యే ఖౌసర్ మోహియుద్దిన్ అడ్డుకున్నారు. దీంతో అక్కడ దాదాపు రెండు గంటల పాటు ఉద్రిక్తత చోటుచేసుకోవటంతో బృం దాలు వెనుదిరిగాయి. శివారులోని సూరారంలోని సాయిబాబానగర్ సమీపంలోని ప్రభుత్వ భూమిలో ఓ రాజకీయ నాయకుడు నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేసేందుకు వచ్చిన జిహెచ్‌ఎంసి అధికారులకు ఓ ఎమ్మెల్యే ఫోన్ చేయటంతో వారు వచ్చిన పని పూర్తి చేయకుండానే తిరిగి వెళ్లినట్లు తెలిసింది. అలాగే ఉప్పల్ నియోజకవర్గంలో మేయర్ బొంతు రామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెర్లపల్లి డివిజన్‌లోని చక్రీపురంలో కూడా ఈ కూల్చివేతలను నిరసిస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళనకు ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే! మరికొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ పలుకుబడిని ఉపయోగించి అడ్డుకునే ప్రయత్నాలు చేయటంతో కూల్చివేతల జోరుగా కొంత తగ్గింది. అయినా గురువారం 190 పై చిలుకు ఆక్రమణలను కూల్చాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న బృందాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు 41 కూల్చగా, సాయంత్రం మొత్తం 180 కూల్చివేసినట్లు అధికారికంగా ప్రకటన జారీ చేశారు. దీంతో నాలుగురోజుల్లో కూల్చిన ఆక్రమణల సంఖ్య 665కు పెరిగింది.