తెలంగాణ

తెలంగాణను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 30: భారీ వర్షా ల వలన తీవ్రంగా నష్టపోయిన తెలంగాణను ఆదుకునేందుకు తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు కేటాయించాలని హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన తెలంగాణలోని వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టంతో పాటు హైదరాబాద్‌లో సంభవించిన నష్టం గురించి రాజ్‌నాథ్‌కు వివరించినట్లు దత్తాత్రేయ శుక్రవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. భారీ వర్షాల వలన సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు వెంటనే కేంద్ర బృందాన్ని పంపాలని కోరగా, రాష్ట్ర ప్రభుత్వం నివేదక పంపించగానే తగు సహాయం చేస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారని తెలిపారు. భారీ వర్షాల మూలంగా తెలంగాణలోని రూ.1,189 కోట్ల నష్టం వాటిల్లిందని, రెండు లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లడంతో రైతులు సర్వం కోల్పోయారని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు జిల్లాల్లోని అనేక రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని దత్తాత్రేయ పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల రుణాలను రీషెడ్యూలు చేయటంతోపాటు వారికి నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాలిక లేదా కార్యచరణ పథకాన్ని రూపోందించాలని దత్తాత్రేయ సూచించారు. భారీ వర్షాల వలన రాష్ట్రంలో నీటి కొరత తీరిందని, అయినప్పటికీ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహాయాన్ని సంపాదించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వెనుకబడిన ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు ప్రధాన మంత్రి సాగునీటి పథకం కింద ఆర్థిక సహాయం అందచేయిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల గురించి ఇటీవల కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి వివరించానని, రాష్ట్రానికి వచ్చి పరిస్థితిని సమీక్షించేందుకు ఆమె అంగీకరించారని దత్తాత్రేయ చెప్పారు. తెలంగాణాలోని కరువు జిల్లాలకు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఎగువ ప్రాంతాలకు గోదావరి జలాలే శరణ్యమని, కనుక ఈ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని త్వరలో ఉమాభారతితో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరనున్నట్లు ఆయన చెప్పారు.