తెలంగాణ

యుద్ధంలో పాల్గొంటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ సైనికాధికారి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. యుద్ధం అనివార్యమైతే తాను యుద్ధంలో పాల్గొంటానని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు సైన్యాధికారిగా పని చేసిన అనుభవాలను కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు. మాజీ సైనికాధికారిగా రిజర్వ్‌లో ఉన్నానని, యుద్ధం వస్తే తనకు సంబంధిత అధికారులు సమాచారం ఇస్తారని ఆయన తెలిపారు. అలా సమాచారం వస్తే యుద్ధంలో తప్పకుండా పాల్గొంటానని ఆయన చెప్పారు. నియంత్రణ రేఖ దాటి మన దేశ సైన్యం మెరుపు దాడులు చేసి పాక్ ఉగ్రవాదులను, పలువురు సైనికులను హతమార్చిన నేపథ్యంలో ఆ దేశం తప్పకుండా ప్రతి దాడికి పాల్పడే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ దేశ మిలటరీ చేతిలో కీలుబొమ్మ అని, మిలటరీ తీసుకునే నిర్ణయమే ప్రధానం కాబట్టి మన దేశంపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రస్తుతం దెబ్బతిని ఉన్నందున ప్రతీకార చర్యలకు పాల్పడుతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇది వెంటనే జరగకపోవచ్చని, అయినప్పటికీ దేశం మొత్తం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరమని కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు.
ప్రాజెక్టుల బాట..
ఇలాఉండగా తమ పార్టీ ప్రాజెక్టుల బాట కొనసాగుతుందని అన్నారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు గుండెకాయ వంటిదని, ఈ ప్రాజెక్టును ఎంతో ముందు చూపుతో లోగడ తమ ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. దీనికి సుమారు 2300 కోట్ల రూపాయల వరకు వ్యయం చేశామని, మరో 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చేదని ఆయన తెలిపారు. అయితే ఆ ప్రాజెక్టు పూర్తి అయితే కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందని భావించిన ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం పేరుతో కొత్త ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నదని ఆయన విమర్శించారు. నాలుగైదు రోజుల్లో టి.పిసిసి కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను నియమించనున్నట్లు ఉత్తమ్‌కుమార్ చెప్పారు.