తెలంగాణ

సర్వే మ్యాపింగ్‌లో విప్లవాత్మక మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఉప్పల్, సెప్టెంబర్ 29: సర్వే మ్యాపింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూగర్భ శాస్త్ర శాఖ సహాయ మంత్రి వై.సుజనా చౌదరి అన్నారు. సర్వే ఆఫ్ ఇండియాలో విభజన జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల కార్యాలయాలను గురువారం ఉప్పల్‌లోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను మల్కాజిగిరి ఎంపి సిహెచ్.మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, సర్వేయర్ జనరల్ స్వర్ణ సుబ్బారావుతో కలిసి ఆవిష్కరించారు. త్వరలో తెలంగాణ రాష్ట్రం మ్యాప్‌ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేంతవరకు హైదరాబాద్ కార్యాలయం నుంచే కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. భారతదేశంలో రైల్వే తర్వాత సర్వే ఆఫ్ ఇండియా గొప్ప సంస్థ అని 250 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. సరిహద్దులో నైసర్గిక స్వరూపాన్ని అతి త్వరగా సమాచారాన్ని శాటిలైట్ ద్వారా తెలుసుకోవడానికి సర్వే ఆఫ్ ఇండియా ఆధునిక సర్వే మ్యాప్‌లను తయారు చేస్తుందని పేర్కొన్నారు. ఎల్‌ఓసి సమీపంలో పాక్ ఉగ్రవాదుల కుట్రలను మెరుపుదాడితో భగ్నం చేసిన భారత సైన్యానికి మంత్రి అభినందనలు తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలపై ప్రజలు గర్విస్తున్నారని పేర్కొన్నారు.
ఎంపి మల్లారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెళ్లుగా ఉంటే దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ సర్వే మ్యాపింగ్ విధానంలో సర్వే ఆఫ్ ఇండియా సరికొత్త మార్పులతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. సర్వేయర్ జనరల్ స్వర్ణ సుబ్బారావు మాట్లాడుతూ రూ.300 కోట్లతో గంగా తప్ప దేశంలోని అన్ని నదులలో నీటి ప్రవాహం దిశలను సర్వే చేస్తుందని, వచ్చే ప్రమాదాలను సర్వే ద్వారా త్వరితగతిన గుర్తించవచ్చన్నారు. సిఓఆర్‌ఎస్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని శాటిలైట్‌తో సర్వే చేయడానికి రూ.22కోట్ల తో పైలెట్ ప్రాజెక్టులను ఇచ్ఛాపురం- ఒరిస్సా, కర్నాటక సరిహద్దులో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

చిత్రం.. సర్వే ఆఫ్ ఇండియా విభజన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ తదితరులు