తెలంగాణ

‘కల్వకుర్తి’ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 30: మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ వేలాది మంది ప్రజలు శుక్రవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి, వెల్ధండ, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు సంబందించిన జెఎసి, కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దర్నాకు జనం కదంతొక్కారు. దాంతో హైదరాబాద్, శ్రీశైలం వెళ్లే రహదారిని దిగ్బందించి గంటల తరబడి ధర్నా నిర్వహించారు. రోడ్డుపైకి వేలాది మంది రావడంతో పోలీసులు కూడా ఆచితూచి అడుగులు వేశారు. ధర్నా ముగిసే వరకు పోలీసులు సైతం ఎవరిని అరెస్టులు చేయకుండా సంయమనం పాటించారు. అయితే ధర్నాకు వచ్చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, మాజీ ఎమ్మెల్యే యడ్మా కిష్ఠారెడ్డిలతో పాటు వివిధ మండలాల ప్రజాప్రతినిధులు హాజ రై రోడ్డుపై బైఠాయించి కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి మాట్లాడుతూ కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే మంచిదని అలా చేస్తే దసరా పండగ రోజు ప్రజలంతా సంబురాలు జరుపుకోవాలని ప్రజల అభిష్టంకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే మాత్రం దసరా రోజు ప్రతి గ్రామంలో రావణాకాష్టానికి బదులు కెసిఆర్ దిష్టిబొమ్మలను కాలుస్తూ పండుగ జరుపుకోవాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని చీల్చేందకు కూడా ముఖ్యమంత్రి కుట్రలు చేస్తున్నారని ఒక వేళ కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ చేస్తూ ఈ ప్రాంతాన్ని మొత్తంగా శంషాబాద్‌లో కలిపిన అభ్యంతరం లేదని పలువురు నాయకులు తమ ప్రసంగాలలో తేల్చిచెప్పారు. గంటల తరబడి రోడ్డుపై వేలాది మంది బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

చిత్రం.. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ మహబూబ్‌నగర్ జిల్లా
ఆమనగల్లులో హైదరాబాద్, శ్రీశైలం రహదారిపై ధర్నా చేస్తున్న ప్రజలు