S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/26/2016 - 06:36

కూచిపూడి, జూన్ 25: రాష్ట్రంలో అదనపు న్యాయస్థానాల ఏర్పాటుపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. శనివారం కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని స్వగ్రామం పెదముత్తేవిలోని స్వగృహానికి వచ్చిన సందర్భంగా ఆయన కలిసిన విలేఖర్లతో మాట్లాడారు.

06/26/2016 - 06:36

విశాఖపట్నం, జూన్ 25: విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు ఇజ్రాయిల్ నుంచి మూడు చింపాజీలు వచ్చాయి. రెండు ఆడ చింపాజీలు, ఒక మగ చింపాజీ శనివారం జంతుప్రదర్శన శాలకు చేరుకున్నాయి. చికో (18 సంవత్సరాలు), చిపా (20 సంవత్సరాలు), చికిత (30 సంవత్సరాలు) అని వీటికి పేరు పెట్టారు. ఇవి వచ్చిన కార్గొ వాహనం తలుపు తెరవగానే రెండు ప్రశాంతంగా ఉండగా, చికిత ఆందోళనగా కనిపించింది.

06/25/2016 - 18:19

విశాఖ: కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీగా గుర్తించిన విశాఖ నగరం అనతికాలంలోనే అభివృద్ధి పథంలో అద్భుతాలను సాధిస్తోందని సిఎం చంద్రబాబు అన్నారు. 2014లో హుదూద్ తుఫాన్ విలయం సృష్టించినప్పటికీ తొందరలోనే విశాఖ కోలుకుందన్నారు.

06/25/2016 - 13:46

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించే కార్యక్రమాన్ని ఎపి సిఎం చంద్రబాబు శనివారం నేలపాడులో ప్రారంభించారు. తన మాటకు విలువనిచ్చి సుమారు 33 వేల ఎకరాల పంట పొలాలను రైతులు రాజధాని కోసం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు.

06/25/2016 - 13:43

విజయవాడ: తక్కువ ధరలకే ఫలహారాలు, భోజనం అందించేందుకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో రెండు అన్న క్యాంటీన్లను శనివారం ప్రారంభించారు. వెలగపూడి వద్ద సిఎం చంద్రబాబు, మల్కాపురం వద్ద మంత్రి పరిటాల సునీత వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఒక్కో క్యాంటీన్‌లో రోజుకు 400 మంది వరకూ ఫలహారాలు, భోజనాలను అందజేస్తారు. అమరావతిలో మరో రెండు క్యాంటీన్లను కొద్దిరోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి సునీత తెలిపారు.

06/25/2016 - 11:46

కర్నూలు: కర్నూలును క్రీడల నగరంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని టిడిపి ఎంపీ టిజి వెంకటేష్ శనివారం ఉదయం ఇక్కడ ఒలింపిక్ రన్‌ను ప్రారంభిస్తూ అన్నారు. వివిధ క్రీడా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో ఒలింపిక్ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక విన్యాసాలు అందరినీ అలరించాయి.

06/25/2016 - 11:46

విజయవాడ: ఎపి సివిల్ సప్లయిస్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడి గొల్లపూడిలో మంత్రి పరిటాల సునీత శనివారం ఉదయం ప్రారంభించారు. తమ శాఖకు సంబంధించి అన్ని కార్యాలయాల తరలింపు రెండు నెలల్లో పూర్తవుతుందని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ త్వరలోనే పూర్తి స్థాయిలో సేవలందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆమె తెలిపారు.

06/25/2016 - 11:45

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శనివారం పర్యటించిన సందర్భంగా 6 లైన్ల రహదారి పనులకు శంకుస్థామన చేశారు. రాజధాని ప్రాంతాన్ని ఇతర మార్గాలకు అనుసంధానం చేసేందుకు ఆరులైన్ల రహదారితో పాటు ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తారు. ఇందుకోసం 215 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు.

06/25/2016 - 07:49

హైదరాబాద్, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలపై కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు శుక్రవారం ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను జస్టిస్ ఏవి శేషసాయి జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎం జయ అనే మసిళ ఎస్సీ, ఎస్టీకమిషన్ ఏర్పాటుకు సంబంధించి విధానాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

06/25/2016 - 07:47

కొత్తూరు, జూన్ 24: శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలంలోని పారాపురం రిజర్వాయర్‌కు ఆనుకొని ఉన్న గూనభద్ర కాలనీని నిర్వాసిత గ్రామంగా గుర్తించాలని ఆ గ్రామస్థులు వంశధార రిజర్వాయర్ పనులను శుక్రవారం అడ్డుకున్నారు. సుమారు 200 మంది ఆందోళనకారులతో సిపిఎం నేతలు చౌదరి తేజేశ్వరరావు, తిరుపతిరావులు పనుల వద్ద రిజర్వాయర్ గట్టుపై బైఠాయించి గూనభద్ర కాలనీని నిర్వాసిత గ్రామంగా గుర్తించాలని నినాదాలు చేశారు.

Pages