S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/28/2016 - 04:38

నందికొట్కూరు: అందరు పోలీసుల్లా జీపులో వెళ్తే ఏం మజా ఉంటుందనుకున్నారో ఏమో ఎస్‌ఐ ఏకంగా గుర్రమెక్కి ప్రజల మధ్యకు వెళ్లారు. గుర్రంపై వచ్చిన ఎస్‌ఐని చూసి వింతగా చూశారు. పగిడ్యాల ఎస్‌ఐ శివాంజల్ సోమవారం గ్రామాల్లో గుర్రంపై స్వారీ చేస్తూ పర్యటించారు. ప్రజలు గబ్బర్‌సింగ్ సినిమాలో హీరో పవన్‌కళ్యాణ్‌ను గుర్తుచేసుకుని లోలోన నవ్వుకున్నారు.

06/28/2016 - 04:33

విశాఖపట్నం/శ్రీకాకుళం, జూన్ 27: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు నమోదయ్యాయి. ఒడిశాలోని తోటపల్లి పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురియడంతో నాగావళికి వరదనీరు వచ్చి చేరుతోంది. తోటపల్లి ప్రాజెక్టు వద్ద సోమవారం మధ్యాహ్నం నాటికి వందమీటర్ల స్థాయిలో నీటిని స్థిరీకరిస్తూ 2767 క్యూసెక్కులు నీరు దిగువ భాగానికి విడిచిపెడుతున్నారు.

06/28/2016 - 04:31

విజయవాడ, జూన్ 27: పాకిస్తాన్‌కు అనుకూలంగా చైనా తనతో పాటు అతి చిన్న దేశాలైన బ్రెజిల్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, టర్కీ, న్యూజిలాండ్ దేశాల సహకారంతో అణు సరఫరా దేశాల బృందంలో భారత్‌కు సభ్యత్వాన్ని నిరాకరించడం ద్వారా మరోసారి తన అసలు రంగును బయట పెట్టిందంటూ స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర కన్వీనర్ పి జనార్ధన్ ధ్వజమెత్తారు.

06/28/2016 - 04:29

విశాఖపట్నం, జూన్ 27: అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో అన్నీ ఉల్లంఘనలేనని, అన్ని నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారని కాంగ్రెస్ నేత, సామాజిక ఉద్యమకారుడు బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. కృష్ణానదిని ఆనుకుని ఉన్న ఇసుక తినె్నల్లో సీడ్ క్యాపిటల్ నిర్మిస్తున్నారని విమర్శించారు. వివిధ సంస్థలకు ఇచ్చిన నివేదికలకు, వాస్తవానికి పొంతన లేదన్నారు.

06/28/2016 - 04:27

విజయవాడ (క్రైం), జూన్ 27: సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ భూముల వేలంపాటకు తన కుమారుడు, అతని వ్యాపార భాగస్వాములు వెళ్లారని, ఈ వ్యవహారంలో వివరాలు తెలియక ఇరుక్కుపోయామన్నారు. సత్రం భూములన్నీ అన్యాక్రాంతం అయ్యాయని, పైగా కోర్టు వివాదాలు ఉన్నాయన్నారు.

06/28/2016 - 04:26

విజయవాడ, జూన్ 27: ‘రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బీద అరుపులు అరుస్తున్నారు. మాట్లాడితే కాంగ్రెస్ అన్యాయం చేసిందని అంటున్నారు. విభజన తరువాత వచ్చిన బీదరికం ఏమిటి? విభజన చట్టంలో ఇచ్చిన హామీలను, అందులో పొందుపర్చిన అంశాలను అమలు చేయించడంలో బాబుదే అసమర్థత’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సి రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.

06/28/2016 - 04:25

తిరుపతి, జూన్ 27: తిరుమలలో సంచరిస్తున్న చిరుత పులులను బంధించేందుకు టిటిడి అటవీశాఖ అధికారులు ఆపరేషన్ చిరుత మొదలు పెట్టారు. ఇందులో భాగంగా శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుతలను పట్టుకునేందుకు ఈస్ట్ బాలాజీ నగర్‌కాలువ, పాచికాల్వ గంగమ్మ గుడి ప్రాంతాల్లో రెండు బోన్లు ఏర్పాటు చేశారు.

06/28/2016 - 04:25

రైల్వేకోడూరు, జూన్ 27: శేషాచలం అడవుల్లో మిగిలిన ఎర్రచందనం వృక్షాలను కాపాడుకునేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బలగాలు సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. స్మగ్లర్లు, కూలీల వేటుకు నేలకొరిగిన ఎర్రచందనం వృక్షాల వివరాలు, వాటి విలువను తెలియజేసే ఫ్లెక్సీలను కడప జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేశారు.

06/28/2016 - 04:24

విశాఖపట్నం, జూన్ 27: విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ అవుట్‌పోస్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అవుట్‌పోస్టుల నిర్మాణానికి రూ.5 కోట్లు, వౌలిక సదుపాయాల కల్పనకు మరో 5 కోట్లు వెచ్చించనున్నారు. ఈ మేరకు డిజిపి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో పాటు నిధుల విడుదలకు సంబంధించి జిఓ జారీ చేసింది.

06/28/2016 - 04:23

అనంతగిరి, జూన్ 27: విశాఖ జిల్లా అనంతగిరి వద్ద భారీ వర్షాలకు కొత్తవలస-కిరండోల్ రైల్వే మార్గంలో సోమవారం ఉదయం విద్యుత్ తీగలపై కొండ చరియలు విరిగిపడడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్తవలస-కిరండోల్ రైల్వే మార్గంలో కిముడుపల్లి-బొర్రా రైల్వే స్టేషన్ 65 నెంబర్ కిలోమీటర్ వద్ద కొండ చరియలు విద్యుత్ తీగలపై విరిగిపడ్డాయి.

Pages