S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/28/2016 - 04:23

చిత్తూరు, జూన్ 27: చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం సూదిగాడు హల్‌చల్ చేసిన ఘటన కలకలం సృష్టించింది. సిరంజిలతో మహిళలపై దాడి చేసి గాయపరచిన ఘటన కుప్పంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కర్నాటక రాష్ట్రం బంగారుపేట్‌కు చెందిన ఇద్దరు అరుల్(18), నవీన్(18) యువకులు స్థానిక ఎన్టీఆర్ కాలనీ వద్ద ఓ ముస్లిం మహిళపై సిరంజితో దాడి చేయగా వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

06/27/2016 - 18:14

చిత్తూరు: రక్తపరీక్షలు చేస్తామంటూ మహిళలకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన ఆగంతకుల బండారం చిత్తూరు జిల్లా కుప్పంలో సోమవారం వెలుగు చూసింది. ఇద్దరు ఆగంతకులు ఓ ఇంట్లోకి ప్రవేశించి రక్తపరీక్షలంటూ నలుగురు మహిళలకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు. ఆ మహిళలు అస్వస్థతకు గురైనట్టు గుర్తించిన స్థానికులు ఓ ఆగంతకుడిని పట్టుకుని చితకబాదారు. మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.

06/27/2016 - 18:13

విజయవాడ: ఎపి విద్యాశాఖకు సంబంధించిన కార్యాలయాలన్నీ నెలరోజుల్లోగా విజయవాడలోనే పనిచేస్తాయని రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన సోమవారం ఇక్కడ ఇంటీర్మీడియట్ విద్య కమిషనరేట్‌ను ప్రారంభించారు. పాఠశాల విద్య, కళాశాల విద్య, సాంకేతిక విద్యకు సంబంధించిన కార్యాలయాల తరలింపు కొద్దిరోజుల్లోనే పూర్తవుతుందన్నారు.

06/27/2016 - 18:12

అనంతపురం: నేత కార్మికులకు వచ్చేనెల 5న ధర్మవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ పత్రాలను అందజేస్తారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పథకాలను, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆరోజు సిఎం ప్రారంభిస్తారు.

06/27/2016 - 15:33

చెన్నై: కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 6 నెలల చిన్నారి జ్ఞానసాయిని చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో జ్ఞానసాయిని డాక్టర్ రేల పరీక్షించారు. పాప పరిస్థితి మామూలుగానే ఉందని, తల్లిదండ్రుల కాలేయం పరిశీలించిన తర్వాత శస్త్రచికిత్సకు ఏర్పాటు చేయనున్నట్టు డాక్టర్ రేల తెలిపారు. శస్త్ర చికిత్సకు 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందని గ్లోబల్ హాస్పటల్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

06/27/2016 - 13:35

అనంతపురం: హంద్రీనీవా సాగునీటి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆయన హిందూపురంలోని పలు చోట్ల మొక్కలను నాటారు. తూముకుంట వద్ద ఎన్టీఆర్ శిలావిగ్రహాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. దివంగత నేత ఎన్టీఆర్ అలనాడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ అవసరమన్నారు.

06/27/2016 - 12:02

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు సమీపించడంతో గుంటూరు, విజయవాడ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ఊపందుకుంది. ఈనెల 27లోగా హైదరాబాద్ నుంచి ఉద్యోగులంతా అమరావతి ప్రాంతానికి తరలిరావాలని ఎపి ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 25 ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యాలయాన్ని ప్రారంభించారు.

06/27/2016 - 12:02

తిరుపతి: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద మోదీ సోమవారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి దర్శన సమయంలో వచ్చిన ఆయనకు పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.

06/27/2016 - 08:08

తిరుమల, జూన్ 26: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో రూ.4.22 కోట్లు హుండీ ద్వారా సమకూరాయి. ఇటీవల కాలంలో ఆలయ లెక్కల ప్రకారం ఇదే రికార్డు ఆదాయంగా నిలిచింది. శనివారం ఆలయ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను ఆదివారం లెక్కించారు.

06/27/2016 - 08:07

అనంతపురం, జూన్ 26 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి తెల్ల రేషన్‌కార్డు కలిగి ఉన్న ప్రతి ముస్లిం కుటుంబానికి ‘చంద్రన్న రంజాన్ తోఫా’ కిట్లను పంపిణీ చేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రులు పల్లె రఘునాథరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

Pages