ఆంధ్రప్రదేశ్‌

అదనపు న్యాయస్థానాలపై హైకోర్టుదే తుది నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూన్ 25: రాష్ట్రంలో అదనపు న్యాయస్థానాల ఏర్పాటుపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. శనివారం కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని స్వగ్రామం పెదముత్తేవిలోని స్వగృహానికి వచ్చిన సందర్భంగా ఆయన కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. న్యాయస్థానాల్లో కేసుల సత్వర పరిష్కారానికి అదనపు న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలన్న విన్నపాల నేపథ్యంలో మొవ్వలో న్యాయస్థానం ఏర్పాటు చేస్తున్నట్లు వెలువడిన ప్రచారాలపై అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మొవ్వ తహశీల్దార్ ఎల్ రామారావు జస్టిస్ చలమేశ్వర్‌కు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అదే గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది, బైపాస్ సర్జరీ చేయించుకున్న కాకర్ల దివయ్య చౌదరి ఇంటికి వెళ్లి చలమేశ్వర్ పరామర్శించారు.