ఆంధ్రప్రదేశ్‌

వంశధార పనులను అడ్డుకున్న ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జూన్ 24: శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలంలోని పారాపురం రిజర్వాయర్‌కు ఆనుకొని ఉన్న గూనభద్ర కాలనీని నిర్వాసిత గ్రామంగా గుర్తించాలని ఆ గ్రామస్థులు వంశధార రిజర్వాయర్ పనులను శుక్రవారం అడ్డుకున్నారు. సుమారు 200 మంది ఆందోళనకారులతో సిపిఎం నేతలు చౌదరి తేజేశ్వరరావు, తిరుపతిరావులు పనుల వద్ద రిజర్వాయర్ గట్టుపై బైఠాయించి గూనభద్ర కాలనీని నిర్వాసిత గ్రామంగా గుర్తించాలని నినాదాలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సిపి ఎం నేతలతో ఆందోళనకారులు అధిక సంఖ్యలో మహిళలు నినాదాలు చేస్తూ బైఠాయించారు. సంఘటనాస్థలానికి విచ్చేసిన ఆర్‌డిఒ రెడ్డి గున్నయ్య ఆందోళనకారులను నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. గూనభద్ర కాలనీని నిర్వాసిత గ్రామంగా గుర్తించే వరకు కూడా తమ పోరాటం ఆపేది లేదని అధికారులకు ఆందోళనకారులు తేల్చిచెప్పారు. పోలీసులు ఆందోళనకారులను వ్యాన్‌లో ఎక్కించి కొత్తూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.