S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/02/2016 - 00:33

కాకినాడ, ఫిబ్రవరి 1: తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఐక్య గర్జన సందర్భంగా ఆదివారం జరిగిన విధ్వంసం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లింది. కాపుల ఐక్య గర్జన ఆద్యంతం ప్రశాంతంగా జరుగుతుందని ఆశించిన వారికి ఈ పరిణామం తీవ్ర బాధనే మిగిల్చింది.

02/01/2016 - 18:30

కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్ల కోసం తాము నాలుగు రోజుల తర్వాత కిర్లంపూడిలోని తన ఇంట్లోనే ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం ప్రకటించారు. భార్యతో కలిసి దీక్ష మొదలు పెడతానని, ఆందోళనకారులు ఎవరికివారు తమ ఇళ్లలో దీక్షలు చేయాలన్నారు. అందరూ కిర్లంపూడికి రావాల్సిన అవసరం లేదని, శాంతియుతంగానే ఉద్యమం కొనసాగించాలన్నారు.

02/01/2016 - 18:29

కాకినాడ: ఇక్కడి కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో సోమవారం ఉదయం రమణమూర్తి (45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది. ఇక్కడి సత్యనారాయణపురానికి చెందిన మృతుడు ‘ప్రజావాణి’ కార్యక్రమం సందర్భంగా కలెక్టర్‌ను కలుసుకునేందుకు వచ్చాడని తెలిసింది. మృతుడి షర్టు జేబులో సూసైడ్ నోట్ దొరికిందని, కాపులకు న్యాయం చేయాలని అందులో రాసి ఉన్నట్లు సమాచారం.

02/01/2016 - 17:03

హైదరాబాద్: కాపు గర్జన సందర్భంగా తునిలో రైలును దగ్ధం చేయడం వంటి హింసాత్మక సంఘటనల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందని సినీ హీరో పవన్‌కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అగ్గిపుల్ల గీస్తే రైలు తగలబడిపోదని, ఒక వ్యూహం ప్రకారమే కాపు గర్జనలో కొందరు హంసకు పాల్పడ్డారని అన్నారు.

02/01/2016 - 16:08

అనంతపురం: గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా బండ్లపల్లిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం పర్యటిస్తారు. ఉదయం పదిన్నర గంటలకు వీరిద్దరూ దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12-30 గంటలకు పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

02/01/2016 - 16:08

విజయవాడ: ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన టక్కర్ సోమవారం ఇక్కడ సిఎం చంద్రబాబును కలిశారు. సిఎం క్యాంపు కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన టక్టర్‌ను ముఖ్యమంత్రి శాలువ కప్పి సత్కరించారు. ఆ తర్వాత వీరిద్దరూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు అనేక కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

02/01/2016 - 16:07

విజయవాడ: ఉద్యమాలు చేస్తున్నవారు పోలీసులపై దాడులకు దిగడం దారుణమని ఎపి పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాపు గర్జన సందర్భంగా తునిలో ఆందోళనకారులు చేసిన దాడిలో 12 మంది పోలీసులు గాయపడ్డారని, ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన సోమవారం మీడియాతో అన్నారు. ఆందోళనలు చేసే వారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.

02/01/2016 - 16:07

హైదరాబాద్: పాలనలో పారదర్శకత లేనందునే ఎపిలో ప్రస్తుతం రాజకీయ, సామాజిక ఉద్యమాలు జరుగుతున్నాయని, ఈ పరిణామాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని సినీనటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి పేర్కొన్నారు. కాపు గర్జన సందర్భంగా తునిలో హింస చోటుచేసుకోవడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన సోమవారం ఎపి సిఎం చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

02/01/2016 - 15:06

హైదరాబాద్: కాపు కులస్థుల కోసం ఇంతవరకూ టిడిపి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని వైకాపా అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తునిలో కాపు గర్జన సందర్భంగా జరిగిన హింసలో కొందరు నేతల హస్తం ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాబు విఫలం కావడం వల్లే కాపులు ఇపుడు ఉద్యమం ప్రారంభించారని జగన్ అన్నారు.

02/01/2016 - 15:05

హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాల కోసం కాపులను రెచ్చగొట్టి వారిని మోసగిస్తున్న ముద్రగడ పద్మనాభం, వైఎస్ జగన్‌లకు ప్రజలే బుద్ధి చెబుతారని ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఆయన సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి కాపులు ప్రశాంతంగా ఉద్యమిస్తారని ప్రభుత్వం భావించిందే తప్ప, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటాయని ఊహించలేదన్నారు.

Pages