ఆంధ్రప్రదేశ్‌

2 గంటల పర్యటనకు అంత హంగామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 25: స్మార్ట్‌సిటీ ప్రతిపాదనలకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో విశాఖలో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ హంగామాగా మిగిలింది. ప్రధాని మోదీ, గతేడాది ఇదే రోజున తొలి దశలో 20 స్మార్ట్‌సిటీలను ఎంపిక చేశారు. తొలి జాబితాలో చోటు దక్కించుకున్న మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి)లో స్మార్ట్ పనులు చేపట్టేందుకు కేంద్రం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. ఇదే సందర్భంలో స్మార్ట్‌సిటీల తీరును వివరించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించారు. గత వారం రోజులుగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, విశాఖ జిల్లా యంత్రాంగం విస్తృత ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ నుంచి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖాముఖి చర్చిస్తారని ఊదరగొట్టారు. బాబు భద్రత నేపథ్యంలో రెండు రోజులుగా జివిఎంసిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న పోలీసులు చివరకు విలేఖరులను సైతం ఆ దరిదాపులకు చేరకుండా అడ్డుకట్టవేశారు. జివిఎంసి పాత కౌన్సిల్ హాల్‌లో సిఎం చంద్రబాబు, ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఈ కార్యక్రమాన్ని కవర్ చేసే విలేఖరులకు జివిఎంసి కమిషనర్ పేషీ వద్ద టివి స్క్రీన్ ఏర్పాటు చేశారు. తొలుత జివిఎంసిలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన చంద్రబాబు, స్మార్ట్‌సిటీపై కమిషనర్ ప్రవీణ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తిలకించారు. సిఎం చంద్రబాబు తన ఉపన్యాసాన్ని ప్రారంభించేందుకు ఉద్యుక్తులవుతుండగా, మోదీ కార్యక్రమం మొదలైంది. దీంతో అధికారులతో సమీక్షను పక్కనపెట్టి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ మొదలవుతూనే సాంకేతిక లోపం తలెత్తడంతో చంద్రబాబు ప్రసంగం బయటకు రాలేదు. సిఎం ఏం మాట్లాడుతున్నారో తెలియక అయోమయానికి గురయ్యారు. బాబు ప్రసంగం పూర్తయిన తర్వాత సాంకేతికలోపం సరిదిద్దారు.
చైనా వెళ్లాలి తొందరగా ముగించండి
మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని, సాయంత్రం 4 గంటలకు విశాఖ జివిఎంసికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆద్యంతం వడివడిగానే తన సమీక్ష సాగించారు. ప్రధాని ప్రసంగం మొదలైన కొద్ది సేపటికే చంద్రబాబు స్థానిక అధికారులతో తన సమీక్షను మొదలు పెట్టారు. మోదీ ప్రసంగం కొనసాగుతుండగా, అప్పటికే ఆలస్యమైందని భావిస్తున్న సిఎం చంద్రబాబు తిరుగు ప్రయాణానికి సిద్ధ పడ్డారు.