S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/28/2016 - 14:32

కాకినాడ: రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మంగళవారం ఉదయం కిర్లంపూడి వెళ్లి కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంను కలిశారు. ఇటీవల ముద్రగడ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ముద్రగడ కుటుంబ సభ్యులను కూడా ఉండవల్లి పరామర్శించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.

06/28/2016 - 14:31

శ్రీకాకుళం: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలాస రైల్వేస్టేషన్‌లో పట్టాలపై ప్రహరీ గోడ కూలింది. దీంతో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాంపై రైళ్ల రాకపోకలు స్తంభించాయి. ఇసుక, ఇటుకలను తొలగించి ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. మిగతా ప్లాట్‌ఫాంల ద్వారా రైళ్లు నడుస్తున్నాయి.

06/28/2016 - 12:17

తిరుపతి: ప్రేమ పేరుతో వేధించి, ఓ యువతి ఆస్పత్రిపాలు కావడానికి కారకులైన ఇద్దరు యువకులను నిర్భయ చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నవీన్ అనే యువకుడు తనతో చదువుకున్న యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో నవీన్ కక్ష పెంచుకున్నాడు.

06/28/2016 - 05:00

హైదరాబాద్, జూన్ 27: ఆంధ్రప్రదేశ్‌లో పౌష్టకాహారంపై ప్రత్యేక చర్యలు తీసుకుని పెద్ద ఎత్తున ఒక ఉద్యమం మాదిరి తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యేలతో ఒక ఫోరం ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పౌష్టికాహారంపై చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఎమ్మెల్యేలను ఫోరంలో సభ్యులుగా నియమిస్తారు.

06/28/2016 - 04:58

హైదరాబాద్, జూన్ 27: రాజధాని అవుతుందని ఆశించి, నిరాశచెందిన ప్రకాశం జిల్లా వాసులకు శుభవార్త. రాజధాని అవుతుందని భావించిన దొనకొండలో పదివేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకానుంది. దీనికోసం ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు బృందం అక్కడి కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. దీనితో జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు రెండేళ్ల నుంచి చేస్తున్న పోరాట ప్రయత్నం ఫలించినట్టయింది.

06/28/2016 - 04:54

హైదరాబాద్, జూన్ 27: ఉద్యోగులకు నష్టదాయకంగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా దశల వారీ పోరాటానికి స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిఎఫ్‌ఐ) జాతీయ కౌన్సిల్ నిర్ణయించిందని యుటిఎఫ్ నేతలు ఐ వెంకటేశ్వరరావు, పి బాబురెడ్డి చెప్పారు.

06/28/2016 - 04:53

హైదరాబాద్, జూన్ 27: శాఖాధిపతుల కార్యాలయాల తరలింపు దాదాపు పూర్తి కావస్తుండటంతో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయానికి మొట్టమొదట తరిలి వెళ్లే శాఖల వివరాలను ఎపి ప్రభుత్వం వెల్లడించింది. వెలగపూడికి వెళ్లే శాఖలపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ అధికారులతో సమీక్షించారు.

06/28/2016 - 04:53

హైదరాబాద్, జూన్ 27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ సాక్షి మీడియా గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. సాక్షి మీడియా దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన ప్రభుత్వం న్యాయస్థానం ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ, ప్రభుత్వం కాని, పోలీసులు కాని సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయమని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొంది.

06/28/2016 - 04:51

హైదరాబాద్, జూన్ 27: విజయవాడలో ఘనంగా కార్యాలయాలు ప్రారంభించినా, చాలా ఆఫీసుల్లో ఇంకా వౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉండటంతో హైదరాబాద్ నుండి తరలి వెళ్లిన ఉద్యోగుల్లో కొంత మంది మళ్లీ వెనక్కు వచ్చారు. పూర్తిస్థాయి సౌకర్యాల కల్పనకు మరో నెలన్నర పట్టేలా ఉందని వారు చెబుతున్నారు. సోమవారం మాత్రం లాంఛనంగా జరిగిన ప్రారంభ కార్యక్రమాలకు ఉద్యోగులు అంతా విజయవాడలో హాజరయ్యారు.

,
06/28/2016 - 04:49

గుంటూరు, జూన్ 27: రాష్ట్ర విభజన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ప్రజలకు అందుబాటులో ఉండేందుకే కార్యాలయాలను తరలిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. సోమవారం గుంటూరు నగరంలోని కలెక్టర్ బంగ్లా రోడ్డులో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.

Pages