ఆంధ్రప్రదేశ్‌

ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ఆంధ్రప్రదేశ్‌లో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జీవో 39, 40, 41, 42,43లను శనివారం నాడు విడుదల చేసింది. ఇంజనీరింగ్‌లో గరిష్టంగా రూ. 1,08,000 ఫీజును ఖరారు చేయగా, ఎంటెక్‌లో గరిష్టంగా లక్ష రూపాయలు, ఆర్కిటెక్చర్‌లో గరిష్టంగా 85వేలు, బిఫార్మసీలో గరిష్టంగా 85వేలు, ఫార్మా డిలో గరిష్టంగా 1.25 లక్షలు, ఫార్మా (పిబి)లో గరిష్టంగా 1.25 లక్షలు ఖరారు చేశారు. రాష్ట్రంలో 275 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్‌విఆర్ అండ్ జెసికి గరిష్ట ఫీజు 1.08 లక్షలు దక్కింది. చాలా కాలేజీలు కనిష్ట ఫీజు 35వేలకే పరిమితం అయ్యాయి. గాయత్రీ ఇంజనీరింగ్ కాలేజీలో 1,03,700, జిఎంఆర్‌లో 1,01,000, వి ఆర్ సిద్ధార్థ 1,02,000, ఎస్‌ఆర్‌కెఆర్ 95వేలు, శ్రీ విష్ణు 95వేలు, ఎంఐటిఎస్ 93వేలు, పిపిఎస్‌ఐటి 97వేలు, శ్రీ విద్యలో 97,800, విజ్ఞాన్‌లో 99వేలు ఫీజు ఖరారు చేశారు. వీటితో పాటు ఇంజనీరింగ్ రెండో షిఫ్ట్ 39 కాలేజీల్లో అనుమతించారు. వాటి ఫీజులు కూడా ఖరారయ్యాయి. ఇక ఎంఇ, ఎంటెక్ 229 రెగ్యులర్ కాలేజీలు, 36 సెకండ్ షిఫ్ట్ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేశారు. అందులో విఆర్ సిద్ధార్థకు 1 లక్ష రూపాయలు ఫీజు ఖరారు చేయగా, కనిష్టంగా 57వేలు నిర్ధారించారు. ఆర్కిటెక్చర్ కాలేజీల్లో కెఎస్‌ఆర్‌ఎంకు 85వేలు ఫీజు నిర్ధారించారు. మిగిలిన కాలేజీలు కనిష్ట ఫీజు 35వేలకే పరిమితం అయ్యాయి. అలాగే 105 బి ఫార్మసీ, 52 పార్మా డి, 22 ఫార్మా పిబి, 101 ఎంఫార్మసీ, 7 ఎం ఫార్మసీ రెండో షిఫ్ట్ కాలేజీల్లో ఫీజు నిర్ధారించారు. ఫార్మాడి, ఫార్మా పిబిల్లో గరిష్టంగా 1.25 లక్షలు, కనిష్టంగా 35వేలు నిర్ధారించారు. మిగిలిన యుజి కాలేజీల్లో కనీసం 25వేలు ఫీజు ఖరారు చేశారు. అన్నమాచార్య కాలేజీలో ఫీజు 1,25,000 ఖరారు చేశారు. శ్రీ విష్ణులో 1,25,000, నారాయణ కాలేజీలో 1,00,000, చలపతిలో 1,25,000, విజ్ఞాన్‌లో 1,10,000 ఫీజు నిర్ధారించారు.