S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/25/2016 - 07:34

భీమవరం, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎటువంటి ఆటంకం కలగనివ్వబోమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్పష్టంచేశారు. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందని, ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే లాభనష్టాలపై కేంద్రం అధ్యయనం చేస్తోందన్నారు.

06/25/2016 - 07:33

గుంటూరు, జూన్ 24: రంజాన్ అంటే క్రమశిక్షణ.. పవిత్రంగా జరుపుకుంటారు.. ముస్లిం మతంలో పేదరికం ఎక్కువ ఉంది.. విద్యతో పాటు సామాజిక.. ఆర్థిక.. రాజకీయ రంగాల్లో మైనారిటీలు ఎదగాల్సిన అవసరం ఉంది.. ఇందుకు ప్రభుత్వం అన్నివిధాలా చేయూత నందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. శుక్రవారం సన్నిధి కనె్వన్షన్‌లో ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.

06/25/2016 - 07:31

అనంతపురం, జూన్ 24: అనంతపురం జిల్లాలో సౌర, పవన విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. జిల్లాలో నీటి కొరత ఉన్నా సౌర, పవన శక్తికి కొదవేలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పవన, సౌర ప్రాజెక్టులకు ప్రాధాన్యతినిస్తూ పలు కంపెనీలకు అనుమతులు మంజూరు చేసింది. జిల్లాలో పవన విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. తాజాగా సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు.

06/25/2016 - 07:31

విశాఖపట్నం, జూన్ 24: మహా విశాఖ నగరపాలక సంస్థ(జివిఎంసి) పరిధిలో స్మార్ట్ సిటీ పనులకు రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్మార్ట్‌సిటీల రూపకల్పలో తొలి అడుగుకు పడబోతోంది. కేంద్రం ఎంపిక చేసిన స్మార్ట్ జాబితాలో చోటుదక్కించుకున్న విశాఖలో ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి సిఎం చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభిస్తారు.

06/25/2016 - 07:30

విశాఖపట్నం, జూన్ 24: హిందూమతం, హిందూ సంస్కృతిపై ఇతర మతాలు సాగిస్తున్న మూకుమ్మడి దాడి నుంచి హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ఆధ్యాత్మిక, సాంఘిక, రాజకీయవాదులు కంకణబద్దులు కావాలని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పిలుపునిచ్చారు.

06/25/2016 - 07:13

గుంటూరు, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు శనివారం నుంచి ప్లాట్లు కేటాయించనున్నారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఈనెల 20వ తేదీనే ముఖ్యమంత్రి చంద్రబాబు నేలపాడు గ్రామంలో రైతులకు ప్లాట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. నేలపాడు గ్రామంలో 1147 నివాస, 769 వాణిజ్య ప్లాట్లు, 55 విల్లాలకు సిఆర్‌డిఎ అనుమతిచ్చింది.

06/25/2016 - 07:11

కర్నూలు, జూన్ 24: సహకార బ్యాంకుల ఆధ్వర్యంలో దేశంలోనే మొట్ట మొదటి ఆటోమెటిక్ టెల్లర్ మిషన్ (ఎటిఎం)ను కర్నూలులో ప్రారంభించనున్నారు. ఈ మేరకు యంత్రాన్ని నెలకొల్పిన అధికారులు సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారం రోజుల్లో ఎటిఎంను ప్రారంభించడానికి కర్నూలు సహకార బ్యాంకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దేశంలో సహకార రంగంలోని బ్యాంకుల్లో అతి కొద్ది బ్యాంకులు మాత్రమే లాభాల బాటలో ఉన్నాయి.

06/25/2016 - 07:10

హైదరాబాద్, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్‌లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల గుండెల్లో స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీనివాస్ రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పిడిగా వచ్చిన నాటి నుండి అన్ని జిల్లాల్లో అక్రమార్కులపై డేగ కన్ను వేసిన శ్రీనివాస్ ఆకస్మిక పర్యటనలు జరుపుతూ రికార్డులను పరిశీలిస్తున్నారు.

06/25/2016 - 07:01

విశాఖపట్నం, జూన్ 24: కోల్‌కతా పోర్టు తరువాత గేట్‌వే పోర్టుగా రూపుదిద్దుకోనున్న విశాఖ పోర్టును నేపాల్ అధికారిక బృందం శుక్రవారం సందర్శించింది. ఇప్పటి వరకూ తమ ఎగుమతి, దిగుమతులను కోల్‌కతా పోర్టు నుంచి నిర్వహిస్తూ వచ్చిన నేపాల్, విశాఖ నుంచి సరుకు రవాణాపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా నేపాల్ బృందం విశాఖలోని పోర్టు అధికారులతో సుదీర్ఘంగా చర్చించింది.

06/25/2016 - 05:36

విజయవాడ, జూన్ 24: నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరలకు అందించే దిశలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ కృషి చేస్తున్నారని, ఇప్పటికే దేశంలో విద్యుత్ మిగులును సాధించారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు.

Pages