ఆంధ్రప్రదేశ్‌

బూత్‌స్థాయి నుంచి మోదీ పథకాలు ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 25: బుల్లెట్ ట్రైన్ వేగంతోప్రధాని మోదీ ప్రభుత్వం పని చేస్తోందని భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ పేర్కొన్నారు. తాను ప్రధానమంత్రిని కాదని దేశంలోని తొలి ప్రజాసేవకుడినని మోదీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించి భారత్‌మాతాకి జై అని నినదించి దేశం మీద గౌరవాన్ని మరింత పెంపొందిస్తున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్టక్రార్యవర్గ సమావేశాల ముగింపుసందర్భంగా శనివారం ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతాపార్టీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీ రైజింగ్.. రైజింగ్ అంటూ అప్రతిహతంగా కొనసాగనుందని ఆయన ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంగా భావిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల కంటే అధికంగా వౌలిక సదుపాయాలు, ఆర్ధిక సహాయం, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ చేయూతనిస్తుందన్నారు. రాష్ట్రానికి ఇప్పటికే రూ. లక్షా 43 వేల కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేసి రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం సహాయం చేస్తోందని తెలిపారు. యుపిఎ హయాంలో 13వ ఆర్ధిక సంఘం ద్వారా రూ.98,820 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్ధిక సహాయంగా రాగా ఎన్‌డిఎ హయాంలో 14వ ఆర్ధిక సంఘం ద్వారా 2015-2020 వరకు రూ.2,06,910 కోట్లు ఆర్ధిక సహాయంగా అందనున్నాయన్నారు. యుపిఎ కన్నా 1,1,19,000 కోట్లు అదనంగా విభజిత ఆంధ్రప్రదేశ్‌కు నిధులు అందనున్నాయన్నారు. సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ జన్‌ధన్, ప్రధానమంత్రి బీమాయోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల ద్వారా రాష్ట్రంలో లక్షలాదిమంది నేరుగా లబ్ధి పొందుతున్నారన్నారు. గ్యాస్ సబ్సీడి పథకంలో నేరుగా లబ్ధిదారులకు నగదు బదిలీ చేయడం వల్ల రూ. 32 కోట్లు కేంద్రప్రభుత్వానికి ఆదా అయ్యిందన్నారు. ఒకపూట భోజనం మానితే పేదలకు ఒకరోజు గోధుమలు లభిస్తాయని మాజీ ప్రధాని లాల్ బహుదూర్‌శాస్ర్తీ ఇచ్చిన పిలుపును గుర్తుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు కోటిమంది గ్యాస్ కనెక్షన్లు వదులుకున్నారని తెలిపారు. ఫలితంగా రాబోయే మూడేళ్లలో 5 కోట్ల మంది పేదమహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. ప్రధాని పిలుపునకు స్పందన లభించడంతో ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ కనెక్షన్లు పొందిన 404 గ్రామాలు పొగరాని గ్రామాలుగా గుర్తింపుపొందాయన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని, కేరళలో 15శాతం, పశ్చిమబెంగాల్‌లో 11శాతానికి పైగా ఓటింగ్ పెరిగిందన్నారు. రాష్ట్రంలో 28లక్షలకు సభ్యత్వం పెరిగిందన్నారు. పార్టీని బూత్‌స్థాయిలో పటిష్ఠం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వ పథకాలను క్షేత్రస్థా యిలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చి పార్టీని వారికి మరింత దగ్గర చేయాలని సూచించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, పార్టీసహా సంఘటనా జాతీయ కార్యదర్శి వి. సతీష్‌జీ, రాష్టమ్రంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, మాజీ కేంద్రమంత్రులు కృష్ణంరాజు, కావూరి సాంబశివరావు, దగ్గుపాటి పురంధ్రీశ్వరి, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు పాల్గొన్నారు.

చిత్రం సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్