ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధి పథంలో విశాఖ పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీగా గుర్తించిన విశాఖ నగరం అనతికాలంలోనే అభివృద్ధి పథంలో అద్భుతాలను సాధిస్తోందని సిఎం చంద్రబాబు అన్నారు. 2014లో హుదూద్ తుఫాన్ విలయం సృష్టించినప్పటికీ తొందరలోనే విశాఖ కోలుకుందన్నారు. పుణెలో శనివారం ఆకర్షణీయ నగరాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా విశాఖలో చేసిన అభివృద్ధి పనులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోదీతో సహా కార్యక్రమానికి విచ్చేసిన వారికిసీఎం చంద్రబాబు వివరించారు. విశాఖను స్మార్ట్‌సిటీగా ఎంచుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. విశాఖ నగరంలో పూర్తి స్థాయిలో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేశాం. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభించాం. ఆగస్టు నాటికి నగరంలోని ప్రతీ ఇంటికి 20 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తాం. అరకు అందాలతో పర్యాటక కేంద్రంగా కూడా విశాఖ అభివృద్ధి చెందుతోంది. అని చంద్రబాబు వివరించారు.