ఆంధ్రప్రదేశ్‌

విశాఖ జూకు ఇజ్రాయిల్ చింపాజీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 25: విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు ఇజ్రాయిల్ నుంచి మూడు చింపాజీలు వచ్చాయి. రెండు ఆడ చింపాజీలు, ఒక మగ చింపాజీ శనివారం జంతుప్రదర్శన శాలకు చేరుకున్నాయి. చికో (18 సంవత్సరాలు), చిపా (20 సంవత్సరాలు), చికిత (30 సంవత్సరాలు) అని వీటికి పేరు పెట్టారు. ఇవి వచ్చిన కార్గొ వాహనం తలుపు తెరవగానే రెండు ప్రశాంతంగా ఉండగా, చికిత ఆందోళనగా కనిపించింది. ఈ చింపాజీలను ఒక నెలపాటు పరిశీలనలో ఉంచుతామని, వాటి ఆరోగ్యం, ప్రవర్తన తదితర అంశాలను గమనిస్తామని జంతు ప్రదర్శనశాల క్యూరేటర్ బి.విజయకుమార్ తెలిపారు. ఈ చింపాజీలను తరలించేందుకు దాదాపు 12.6 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇజ్రాయిల్‌లోని టెల్‌అవీవ్ నుంచి విమానంలో ముంబయికి, అక్కడి రోడ్డు మార్గం ద్వారా విశాఖకు తరలించారు. ఎసి కార్గొ సదుపాయం కోసం ప్రయత్నించినప్పటికీ లేకపోవడంతో సాధారణ వాహనంలో తరలించామని, ఇద్దరు నిపుణుల సేవలను ఈ తరలింపులో తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గ్రేట్ ఏప్ జాతికి చెందిన ఈ చింపాజీలు దాదాపు 50 సంవత్సరాల వరకూ జీవిస్తాయని, 8 నుంచి 10 సంవత్సరాల మధ్య యవ్వనదశకు చేరుకుంటాయని వివరించారు.