S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

04/24/2017 - 21:00

తెలుగు సినిమాకు ఆత్మగౌరవం ఆయన. సిరిసిరిమువ్వల సిరివెనె్నలో స్వాతి ముత్యాల జల్లు విశ్వసాథ్ సినీ ముద్ర. సంగీత, సాహిత్య, నృత్యాభినయాలకు వెండితెర దివిటీలు ఆయన సినిమాలు. సిరిసిరిమువ్వతో తెలుగు సినిమా గతిని మార్చిన ఆయన శంకరాభరణంతో తనేమిటో రుజువు చేసుకున్నారు. మొత్తం సినిమానే తన వెంట తిప్పుకున్నారు. తీసింది తక్కువ సినిమాలే అయినా దేనికదేసాటి. మరో సినిమాతో పోల్చలేని నిరుపమానత విశ్వనాథుని సృజన.

04/24/2017 - 20:57

విశ్వనాథ్ సినిమాలు ఎంతగా తెలుగు ప్రేక్షకులను అలరించాయో.. ఆయన పరిచయం చేసిన ఇద్దరు అనంతర కాలంలో సినిమాను కొత్త పుంతలు తొక్కించిన నిరుపమాన రచయితలయ్యారు. ఓ సీత కథతో వేటూరిని, సిరివెనె్నలతో సీతారామ శాస్ర్తీని పరిచయం చేసిన ఘనత విశ్వనాథ్‌దే. వేటూరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారంటే ఆ సినిమాలో సీతారామశాస్ర్తీ రాసిన పాటలు ఎంతటి కమనీయమైనవో చెప్పక చెప్పేదే.

04/24/2017 - 20:54

ఎప్పుడూ..
పిఎస్‌ఎల్‌విలాంటి రాకెట్ ప్రయోగానికి ముందు కౌంట్‌డౌన్ ప్రక్రియ ఒకటుంటుంది. 48 గంటల ముందునుంచి అది మొదలవుతుంది.
ఇప్పుడు-

04/18/2017 - 00:50

బాహుబలి.. తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన సినిమా. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ తెచ్చుకున్నాడు హీరో ప్రభాస్. అప్పటివరకూ టాలీవుడ్ హీరోగావున్న ప్రభాస్, ఇప్పుడు యూనివర్సల్ హీరోగా మారిపోయాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన బాహుబలి మొదటి భాగం సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ‘కన్‌క్లూజన్’ పార్ట్ -బాహుబలి-2 వస్తోంది. ఏప్రిల్ 28న చిత్రం విడుదలవుతున్న సందర్భంలో హీరో ప్రభాస్‌తో ఇంటర్వ్యూ.

04/03/2017 - 22:19

హాయిగా నవ్వుకొని ఎన్నాళ్లైంది? కన్నీరొలికేలా నవ్వి ఎన్ని రోజులైంది? ఒళ్లు పులకరించి -మనసంతా వెక్కివెక్కి నవ్వి యుగాలైనట్టు లేదూ?!

03/27/2017 - 23:32

అవును! వాళ్లదే ఇష్టపడుతున్నారు. కోట్ల బడ్జెట్‌ను పెనుభూతం గుటుక్కున మింగేస్తున్నా -ఎంగిలి కథల్ని ఎక్కడెక్కడి నుంచో ఏరి తెచ్చుకుని రీ‘మేకు’లు
కొట్టుకుంటున్నారు.
ఎందుకంటే -కథను
అల్లుకోవడం కంటే,
నొల్లుకోవడం సులువు కదా!
-తెలుగు పరిశ్రమ మీద తెరకు దూరమైన ఓ సీనియర్ నటుడు వేసిన బండరాయి ఇది. ‘మమకారం చంపుకోలేక ఈ మాట అంటున్నా’ అంటూ ఒకింత గుండె తడినీ వినిపించాడు ఆయన.

03/21/2017 - 01:02

ఎవరన్నారు? -తెలుగు హీరో మారడని. కథ కోసం కాకున్నా -కానికాలం దాపురించినపుడు కెరీర్ కోసమైనా మారాలి. లేకపోతే ఆడియన్స్‌కు విలనైపోతాడు.

03/14/2017 - 23:12

రాక్షసుడు ఎంత బలవంతుడైతే -శిక్షించే దేవుడు అంత గొప్పగా కనిపిస్తాడు. విలన్ ఎంత పవర్‌ఫుల్ అయితే -హీరో అంతగా ఎలివేట్ అవుతాడు. అందుకే తెలుగు సినిమా -ఇప్పుడు విలనే్న హీరోగా భావిస్తోంది. హీరోలనే విలన్లు చేస్తూ స్క్రీన్‌మీద చూపిస్తోంది. స్కీం వర్కవుటవ్వడంతో -కుర్ర హీరోలు సైతం విలనిజం పండించడానికి ఎగబడుతున్నారు.

03/07/2017 - 03:36

తెలుగు సినిమా హీరోల నుంచి కొద్దికాలంగా కొత్తగా వినిపిస్తోన్న పదం -ప్రయోగం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇది -పరిశ్రమకు వైరస్‌లా పట్టింది. హీరోలెవరైనా కావొచ్చు. కథలు వేర్వేరుగా ఉండొచ్చు. కానీ, కామన్‌గా వినిపిస్తోన్న పాస్‌వర్డ్ -ప్రయోగం. అంటే -తెలుగు పరిశ్రమలో ఇప్పుడే ప్రయోగాలు
మొదలయ్యాయన్నంత బిల్డప్. ఇంతకుముందెన్నడూ ఎవ్వరూ ఇలాంటి సాహసాలు

02/27/2017 - 22:09

అనుకున్నట్టే లాలా ల్యాండ్ ఆస్కార్ల పంట పండించింది. నామినేషన్ల స్వీకరణ దగ్గర్నుంచీ అంచనాలను పెంచేసిన లాలా ల్యాండ్ -మొత్తానికి 89వ ఆస్కార్ ఉత్సవాన్ని ఉతికి ‘ఆరే’సింది. 14 విభాగాల్లో నామినేషన్లు పొందిన లాలా ల్యాండ్‌కు ఆరు విభాగాల్లో ఆస్కార్లు అందాయి. ఫలితాల ప్రకటనకు ముందు -కనీసం ఐదుకు మించి ఆస్కార్లురాకుంటే న్యాయ నిర్ణయమే తప్పన్నంత గొప్పగా ఈ చిత్రం అందరి నోళ్లలో నానింది.

Pages