S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/11/2017 - 18:46

‘అజ్ఞాతవాసి’కి ఎదురేలేదు..అంటున్నారు పవన్‌కళ్యాణ్ వీరాభిమానులు. వారి మాటల్లో అర్థం లేకపోలేదు. ప్రస్తుతం ఆయన రెండు పడవల ప్రయాణం చేస్తూ అటు అభిమానులను, ఇటు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరో వైపు రాజకీయంగానూ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.

12/04/2017 - 19:48

‘ఒక దృశ్యం, గ్రంథం, చిత్రం నచ్చనంత మాత్రాన తలలు తీస్తాం, ముక్కులు కోస్తాం’ అని బెదిరించటం
అప్రజాస్వామికం’ అని భారత ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు హెచ్చరించారు. ఇప్పుడు తెలుగులో

11/27/2017 - 20:06

అభిమాన హీరో చిత్రం షో ప్రారంభమైందంటే
చాలు.. థియేటర్లలో ఒకటే గోల, ఈలలు, కేకలు.
విడుదల రోజు ప్రదర్శనలు, ర్యాలీలు, ఊరేగింపులు.
ఇవి చాలవన్నట్లు థియేటర్ వద్ద జోరుగా.. హుషారుగా హంగామా. అభిమానం అన్నది ఉండాల్సిందే.. ఎవరూ
కాదనలేరు. అయితే ఆ అభిమానం కాస్త హద్దులు
దాటకుండా ఉంటే మంచిది అని గ్రహించినప్పుడే
వారి అభిమానానికి ఓ విలువ. వారి అల్లరికి ఓ అర్థం.

11/20/2017 - 19:28

తెలుగు చిత్రసీమలో ఇప్పుడు ఎటు చూసినా, ఎవ్వరినోటా విన్నా నంది అవార్డుల ఆ‘నందో’త్సాహమే కనిపిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత గత ఐదేళ్లుగా
చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డుల వేడుక లేనేలేదు. దాంతో పరిశ్రమలో కాసింత నిరాశ.. నిస్పృహ... ఈ పండగ ఎప్పుడెప్పుడా? అని చిత్రసీమ
ఆసక్తిగా ఎదురుచూసింది. వారి ఎదురు చూపులకు ఫలితం రానే వచ్చింది.

11/06/2017 - 19:29

సినీ మాధ్యమం ద్వారా పిల్లల్లో వారి భవిష్యత్ పట్ల బాధ్యత, మనస్తత్వాన్ని, నైతిక విలువలను, మానవీయ ఆదర్శాలను పెంపొందించడం ప్రధానంగా తీసుకొని బాలల చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. కానీ కమర్షియల్ విలువలతో నిర్మించిన చిత్రాల స్థాయిలోనే బాలల చిత్రాలను ఆలోచించడంతో అనుభూతి ప్రధానమైన సినిమాలు కనపడటం లేదు.

10/30/2017 - 20:10

ఈ రోజున మన తెలుగునాట సినిమా అనే మూడక్షరాల కల్పవృక్షాన్ని, కామధేనువును వ్యాపారంగా మార్చుకొని కోట్లకు కోట్లు సంపాదించుకున్న వాళ్లు ఎందరో వున్నారు. పెద్ద హీరోలుగా, నిర్మాతలుగా, దర్శకులుగా, ఎగ్జిబ్యూటర్లుగా, డిస్టిబ్యూటర్లుగా, ఇతర విభాగాల సాంకేతిక నిపుణులుగా ఎదిగిన వాళ్లున్నారు. వాళ్లంతా అంత గొప్పగా కీర్తి ప్రతిష్టలతో పాటు ఆస్తిపాస్తులు, అంతస్తులు సంపాదించుకోవడానికి కారణం సినిమా.

10/23/2017 - 19:44

టాలీవుడ్‌తోపాటు సౌత్ ఇండియన్ స్క్రీన్‌పై ప్రస్తుతం దెయ్యాల ట్రెండ్ బాగా నడుస్తోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ తరహా సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు దర్శక, నిర్నాతలు. దెయ్యాల సినిమాలకు ప్రత్యేక ప్రేక్షకులతో పాటు, సహజంగా అన్ని వర్గాల్లోని వారు ఆసక్తి కనబరుస్తుంటారు. అందులో యూత్‌లో ఎక్కువ క్రేజ్, పైగా దెయ్యాల సినిమాలకు పెద్దగా బడ్జెట్ సమస్య కూడా ఉండదు. ఎంతైనా కామెడీ పిండుకోవచ్చు.

10/16/2017 - 23:57

బాక్సాఫీస్‌ను షేక్ చేసి కోట్ల రూపాయల వ్యాపారమే లక్ష్యంగా ప్రస్తుతం టాలీవుడ్ పావులు కదుపుతోంది. తెలుగు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు కొన్ని ప్రత్యేకమైన సీజన్‌లు వున్నాయి. అవి సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి ఇలాంటి సీజన్‌లలో విడుదలయ్యే చిత్రాలకు మినిమం గ్యారంటీతో పాటు, ఆయా చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద భలే గిరాకీ ఉంటుంది.

10/09/2017 - 20:44

కథానాయకులతో పోలిస్తే మా పాత్రలకు ప్రాధాన్యమే దక్కడం లేదంటూ నిరుత్సాహాన్ని వ్యక్తం చేసేవారు ఇది వరకు కథానాయికలు. కానీ ఇటీవల వాళ్ల స్వరం మారుతోంది. మాకూ మంచి రోజులొచ్చాయని చెబుతున్న మెరుపుతీగలు ఇప్పుడు చాలా మందే కనిపిస్తున్నారు. తెలుగు సినిమాలో కథానాయిక పాత్రల గురించి తొలినాళ్లలో విన్నది ఒక రకం. ఇప్పుడు చూస్తున్నది మరో రకం. వారి పాత్రలకి ప్రాధాన్యం పెరుగుతుంది. ఇదో మంచి మార్పు.

10/03/2017 - 03:31

కొండమీదనుండి ఉద్ధృతంగా దూకే అలలు అంతే ఉరవడితో ప్రవహిస్తాయని నమ్మకం లేదు. ఒక్కొక్క అల ఆకాశాన్నంటితే మరో అల తన ఉనికిని కూడా చాటలేక తెల్లబడిపోతుంది. బాలనటులుగా
ప్రవేశించిన అనేకమంది వారి ప్రతిభతోనే
అద్భుతమైన చిత్రాలను అందించారు.
ప్రేక్షకులకు ఆరాధ్యులుగా మారారు. మరికొందరు ఇప్పటికీ ఎక్కడున్నారో తెలియని పరిస్థితి.
ప్రతిభ లేని ఏ నటులైనా తెరమరుగు

Pages