మెయిన్ ఫీచర్

‘జై’ అనాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జైలవకుశ’. రాశీఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. టీజర్‌లో మూడు పాత్రలకు ఎన్టీఆర్ కనబరచిన వైవిధ్యమైన నటనకు అటు అభిమానులే కాదు ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఉన్నాడంటే థియేటర్లవద్ద అభిమానులు బారులు తీరుతారు. అలాంటిది ముగ్గురు ఎన్టీఆర్‌లు ఒకేసారి తెరపై కన్పిస్తారంటే ఇంకెంత ఆసక్తిగా వుంటుందో చూడాల్సిందే. ఈనెల 21న ముగ్గురు ఎన్టీఆర్‌లు థియేటర్‌లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ‘జై లవకుశ’ గురించి ఎన్టీఆర్ తన మనసులోని భావాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే...
పదాలు వెతుక్కున్నా..
తమ తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చేందుకు కళ్యాణ్‌రామ్‌తో కలిసి ‘జై లవకుశ’ తీశాం. అన్నదమ్ముల అనుబంధాన్ని చాటే గొప్ప చిత్రమిది. ఇందులో ‘జై’పాత్ర అంటే నాకెంతో ఇష్టం. ఈ చిత్రం అభిమానులను గర్వపడేలా చేస్తుంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అందరి అభిమానం, వాత్సల్యం నాకు దక్కింది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను. జైలవకుశ చిత్రం గూర్చి మాట్లాడడానికి మొదటిసారి పదాలను వెతుక్కుంటున్నాను. ఎప్పుడూ ఇంత గందరగోళం లేదు. లోపల వున్న ఎమోషన్ వున్న పదాలు రావడంలేదు. దేవుడు చల్లగా చూశాడు. అభిమానులు ప్రోత్సహించారు. నా దర్శకులు ప్రోత్సహించడంవల్లే ఈ స్థాయిలో వున్నా. ఈ మూడింటిలో ఏ ఒక్కటి తక్కువైనా బహుశా జై లవకుశ చిత్రం ఉండేది కాదేమో.
దేవుడే పంపాడు..
‘నాన్నకు ప్రేమతో’ చిత్రం మంచి కథలకు ఆద్యం పోసింది. టెంపర్, జనతాగ్యారేజ్ చిత్రాల తరువాత నేను, అన్న బ్యానర్‌లో ఎలాంటి సినిమా చేద్దామా అని అనుకుంటున్నప్పుడు ఆ మాట వినే దేవుడు బాబీని పంపాడేమో. బాబి కథ చెప్పగానే భయం వేసింది ఈ చిత్రం చేయగలుగుతానో లేదో అని. మా కలలు నెరవేర్చే ఆయుధాలన్నీ కథలో వున్నాయి. కథ విన్న వారంరోజుల తరువాత నాకు అత్యంత ఆప్తుల వద్ద ఈ కథను షేర్ చేసుకున్నా. అద్భుతంగా ఉందన్నారు.
టెక్నీషియన్స్ అదుర్స్
సినిమాకు తొలిసారిగా ఎంపికచేసిన టెక్నీషియన్ దేవిశ్రీ ప్రసాద్. ఆయన ఇచ్చిన పాటల ద్వారా మా మధ్య వున్న బంధం తెలుస్తుంది. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి చేస్తే అందరూ హాయిగా ఉండవచ్చు. ఇంత త్వరగా సినిమా పూర్తికావడానికి ఆయనే కారణం. బాబి పడిన కష్టానికి కోన, చక్రిలు కుడి ఎడమ భుజాల్లా నిలిచారు. బాబిలో వున్న నమ్మకమే ఈ చిత్రం.
వారికే అంకితం
కథానాయికలు రాశీఖన్నా, నివేదా థామస్‌లు చక్కటి సహకారాన్ని అందించారు. మూడు పాత్రలు చేసేటప్పుడు 38 విఎఫ్‌ఎక్స్ షాట్స్ చేయాల్సి వచ్చేది. 76 సార్లు బట్టలు మార్చుకోవాల్సి వచ్చేది. అంత కష్టం అభిమానులకోసమే. ఈ చిత్రం బాగా రావడానికి వారెంతో కష్టపడ్డారు. జైలవకుశ ఒక్క జై చిత్రం కాదు. జై, లవ, కుశ ముగ్గురిదీ. ప్రపంచంలో అన్నదమ్ములందరికీ ఈ చిత్రం అంకితం. ఏ తల్లికైనా ముగ్గురు పిల్లలు పుడితే రామ, లక్ష్మణ, భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ, రామ, లక్ష్మణులు అయ్యారు అంటూ ప్రారంభమయ్యే ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది.
అన్నదమ్ములుగా మా నాన్న పక్కన గర్వంగా నిలబడే సపోర్టును, స్ఫూర్తిని జై లవకుశ ఇస్తుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను. జై లవకుశ చిత్రం నాకు కేవలం ఒక్క చిత్రంకాదు. ఎందుకంటే భగవంతుడు ఒక నటుడికి ఇలాంటి అవకాశం ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. బాబి ఎందుకిలాంటి కథ ఎన్నుకున్నాడో తెలియదు.
ఎమోషనల్‌గా..
జనతాగ్యారేజ్ తరువాత ఎలాంటి చిత్రం చేయాలి అన్న సందిగ్ధంలో వుండిపోయాను. మనసుకు నచ్చింది చేయాలా లేక ట్రెండ్‌కు ఫాలో అవుతూ చేయాలా అన్నది అర్థం కాలేదు. బాబి కథ చెప్పడంతోనే నిర్ణయించుకున్నా మనసుకు నచ్చినదే చేయాలని. నా మనసుకు బాగా నచ్చిన చిత్రం ‘జై లవకుశ’. ఎందుకు ఇంత ఆలోచించడం జరిగిందంటే దానికో ఎమోషనల్ పాయింట్ వుంది. అది నేను మా కళ్యాణ్ అన్న, మా పెద్దన్న నందమూరి జానకిరామ్. నేను, కళ్యాణ్ అన్న కలిసి చేసిన ఈ చిత్రం మా తరువాతి తరానికి గుర్తుండిపోతుంది.
నాన్నకు ఓ గిఫ్ట్ ఇవ్వాలని తాపత్రయపడుతున్న సందర్భంలో పుట్టిన కథే ఇది. అన్నదమ్ములు చేద్దామనుకుంటున్న చిత్రానికి అన్నదమ్ముల ఔన్నత్యాన్ని, బంధాన్ని పెంపొందించే చిత్రం దొరకడం నిజంగా భగవంతుడు ఇచ్చిన అరుదైన అవకాశంగా భావిస్తున్నా అని ముగించారు.

-ఎం.డి అబ్దుల్