S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/08/2016 - 05:32

హైదరాబాద్, మే 7: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండవ తేదీన హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్క్‌లో దేశంలోనే అతి పెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ వివిధ శాఖల అధికారులతో శనివారం సమన్వయ సమావేశం జరిపారు.

05/08/2016 - 05:31

హైదరాబాద్, మే 7: తెలంగాణ రాష్ట్రంలో పాడిపరిశ్రమాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని విజయ డైరీ ప్లాంట్‌ను సందర్శించారు. 2.48 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన బాయిలరీ ప్లాంట్‌ను, 1.70 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన లాబోరేటరీని, గోదామును ప్రారంభించారు. తర్వాత అధికారులతో సమావేశమయ్యారు.

05/08/2016 - 05:25

హైదరాబాద్, మే 7: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

05/08/2016 - 05:24

హైదరాబాద్, మే 7: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ల అసోసియేషన్, అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు డిమాండ్ చేశారు. శనివారంనాడు హైకోర్టు వద్ద నిర్వహించిన సంయుక్త సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రొవిజినల్ జాబితాకు వ్యతిరేకంగా ఆంధ్ర, తెలంగాణ మధ్య న్యాయాధికారులను కేటాయించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.

05/08/2016 - 05:23

హైదరాబాద్, మే 7: రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల నుంచి ప్రజల, ప్రతిపక్షాల దృష్టి మరల్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొత్త జిల్లాల ప్రతిపాదనను ‘తెర’పైకి తెచ్చిందని బిజెపి, కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిశారు.

05/08/2016 - 03:03

హైదరాబాద్, మే 7: ఇంజనీరింగ్ విద్యార్థిని కె.దేవిరెడ్డి మృతికి రోడ్డు ప్రమాదమే కారణమని తెలుస్తోంది. లోతుగా దర్యాప్తు జరిపిన తర్వాత పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే తమ కుమార్తెను హత్య చేశారని, కనుక ఈ కోణంలో దర్యాప్తు జరపాలని దేవిరెడ్డి తల్లితండ్రులు సిపిని కలిసి కోరారు.

05/08/2016 - 02:59

నల్లగొండ, మే 7: కరవు జిల్లా అయన నల్లగొండలో బత్తాయి రైతు లను దారుణంగా దెబ్బతీస్తు భారీ నష్టాలపాలు చేస్తోంది. వర్షాలు లేక ఎండిపోతున్న బత్తాయి చెట్లను రక్షించుకునేందుకు లక్షల రూపా యల మేర అప్పులు చేసి, బోర్లు వేసినా, భగీరథ ప్రయత్నాలు చేసినా భూగర్భ జలాలు లభించక విసుగెత్తిపోతున్న బత్తాయి రైతులు తోటలను తొలగించే దిశగా సాగిపోతున్నారు.

05/08/2016 - 02:55

హైదరాబాద్, మే 7: దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించిందని, అంతే తప్ప రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు తన జేబు నుంచి గానీ తన తండ్రి జేబు నుంచి గానీ చెల్లించలేదని టి.టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

05/08/2016 - 02:51

కరీంనగర్, మే 7: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్ఫంతో గోదావరి జలాలను వినియోగించుకునేందుకు మేడిగడ్డ (కాళేశ్వరం) ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తే, ప్రతిపక్షాలు ఆ ప్రాజెక్టుపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో ప్రజల పక్షాన నిలబడతారో..రాజకీయం చేస్తారో తేల్చుకోవాలని ఆ పార్టీ నేతలకు హితవు పలికారు.

05/08/2016 - 02:50

మందమర్రి, మే 7: ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలంలోని పల్లంగూడ గ్రామంలో బాలికపై అత్యాచారం జరిపిన ఐదుగురు నిందితులను శనివారం అరెస్టు చేశామని బెల్లంపల్లి డిఎస్‌పి రమణారెడ్డి తెలిపారు. ఇదే కేసులో పంచాయితీ నిర్వహించిన 20 మందిపై కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. శనివారం మందమర్రి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘటనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.

Pages