తెలంగాణ

కరవునుంచి దృష్టి మళ్లించేందుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల నుంచి ప్రజల, ప్రతిపక్షాల దృష్టి మరల్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొత్త జిల్లాల ప్రతిపాదనను ‘తెర’పైకి తెచ్చిందని బిజెపి, కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిశారు. అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడుతూ కరవు పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదనను తీసుకుని వచ్చారని విమర్శించారు. జిల్లాల సంఖ్య పెంచడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే ఇది సమయం, సందర్భం కాదని అన్నారు. బిజెపి సీనియర్ నాయకుడు, బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నాగం జనార్ధన్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రతిపాదన చేయడంతో అందరూ ఆ చర్చలో నిమగ్నమైపోతారని, కరవు గురించి దృష్టి సారించరన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ ఉపాయం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పన్నిన పన్నాగంలో ప్రతిపక్షాలు పడ్డాయని అన్నారు.