S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/06/2016 - 13:49

బాసర, మే 5: ఆదిలాబాద్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో 2016-17 సంవత్సరానికిగాను ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ శుక్రవారం నుండి ప్రారంభమవుతుందని యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ సత్యనారాయణ తెలిపారు.

05/06/2016 - 12:16

హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొన్నందున యుద్ధప్రాతిపదికపై కరవు సహాయక చర్యలు ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని టి.టిడిపి నేతలు శుక్రవారం ఇక్కడ గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇటీవల తాము కరవుయాత్ర చేపట్టగా రైతులు ఎంతో దయనీయ పరిస్థితుల్లో ఉన్నట్లు వారు గవర్నర్‌కు వివరించారు.

05/06/2016 - 12:15

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వీచడంతో చాలాచోట్ల చెట్లు విరిగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చాలారోడ్లపై నిలిచిన వర్షపునీటిలో వాహనాలు కూరుకుపోయాయి.

05/05/2016 - 18:07

హైదరాబాద్: వ్యవసాయ శాఖలో భర్తీచేయనున్న వ్యవసాయ విస్తరణాధికారి గ్రేడ్-2 పోస్టులకు నిర్వహించే రాతపరీక్షకు బిఎస్సీ (అగ్రి) ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలంగాణ సర్కారు గురువారం ప్రకటించింది. ఈ వెసులుబాటు ఈ ఏడాదికి మాత్రమే ఉంటుంది.

05/05/2016 - 17:09

హైదరాబాద్: తమ పార్టీ గుర్తుపై ఎంపీగా గెలిచి, తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా వ్యవహరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెరాసలో చేరడం తీరని ద్రోహమని వైకాపా కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలిపారు. పొంగులేటికి సత్తా ఉంటే- ఎంపీ పదవికి రాజీనామా చేసి తెరాస అభ్యర్థిగా ఎన్నికల్లో గెలవాలని వారు సవాల్ చేశారు.

05/05/2016 - 17:07

నల్గొండ: సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో గురువారం ఉదయం ధ్వజస్తంభం నేలకూలింది. దీంతో భక్తజనులు ఆందోళన చెందుతున్నారు. పురాతనమైన ఈ ఆలయంలో ధ్వజస్తంభాన్ని వెంటనే ప్రతిష్ఠించాలని వారు కోరుతున్నారు.

05/05/2016 - 17:06

హైదరాబాద్: శ్రీకాకుళం నుంచి వచ్చి నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంటున్న కుటుంబాలకు చెందిన ఇద్దరు బాలురు బుధవారం నుంచి కనిపించకుండాపోయారు. బాలుర తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఇద్దరినీ ఎవరైనా కిడ్నాప్ చేశారా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.

05/05/2016 - 17:06

హైదరాబాద్: తమ సంస్థ ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు ఎపికి బస్సుల సంఖ్యను పెంచుతామని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గురువారం తెలిపారు. లాభదాయకంగా ఉన్న రూట్లలో బస్సుల సంఖ్యను పెంచితే ఆర్టీసీకి కొంతవరకైనా నష్టాలు తగ్గుతాయన్నారు. నగరంలోని ఎంజిబిఎస్‌ను 9 కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునీకరిస్తామన్నారు.

05/05/2016 - 15:12

హైదరాబాద్: పాలేరు ఉపఎన్నికలో అక్రమాలను నిరోధించేలా ఓటింగ్ యంత్రాల (ఈవిఎం)కు ప్రింటర్లు ఏర్పాటు చేయాలని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఉపఎన్నిక నిష్పక్షపాతంగా జరపాలన్న ఉద్దేశంతో ఖమ్మం కలెక్టర్, ఎస్పీ, మరో అధికారిని ఇటీవల బదిలీ చేసినా, అధికారుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు.

05/05/2016 - 15:12

హైదరాబాద్: బీరు, శీతల పానీయాల తయారీ పరిశ్రమలకు భారీగా నీటిని కేటాయించడంపై విచారణ జరపాలని గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సామాన్య ప్రజలు తాగునీటి కోసం నానా అవస్థలు పడుతుండగా, పరిశ్రమలకు ఇష్టారాజ్యంగా నీటిని కేటాయిస్తున్నారని పిటిషనర్ వివరించారు.

Pages